loading

Prediction Type: Yearly

Pisces Yearly

pisces

Pisces (మీనం)

పూర్వాభాద్ర 4 వ, ఉత్తరాభాద్ర 4, మీనం 4 పాదములు

ఈ రాశి వార్కి కష్ఠకాలం. ఏలినాటి శని ప్రభావం మధ్య పాదం మరియు ప్రమాదకరం. కష్ట కాలం మరియు పరీక్ష కాలమా అన్నట్లు ఉండును. ఇక వివరాలలోకి వెళ్తే’

 

గురుడు కర్మ/తానూ అధిపతి,  (3) భాతృ / (4) మాతృ / (5) పుత్ర / స్థానములలో సువర్ణ, రజత, తామ్ర, లోహ మూర్తి, అంతగా కలసి రాని కాలం.

గురుడు 30/03/2025- 14/05/2025 లలో సువర్ణ మూర్తిగా 3/భాతృ స్థాన సంచారం. అనారోగ్యము, అధిక ఖర్చు, శ్రమతో కూడిన వృధా ప్రయాణములు. బదిలీలు, స్థల మార్పిడి. విశేష వ్యథ. తదుపరి 15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 రజత / లోహ మూర్తిగా 4/మాతృ స్థాన సంచారం. ప్రభుత్వ దండన, పదవి పోవుట, అపనిందలు, దగ్గర సంబంధీకుల మరణం, మనో వ్యథ, వస్తు నాశనం. ఇక 19/10/2025 – 05/12/2025 లలో తామ్ర మూర్తిగా 5/పుత్ర సంచారం. పుత్ర, పౌత్ర లాభం, స్టిరాస్తి సమకూలన, అధికార లాభం, పండుగ, శుభ కార్యక్రమములు, ఉత్తమ విద్య, సామాజిక శుభ కార్యక్రమములు, కుటుంబ సౌఖ్యం. అత్యుత్తమ సమయం.


శని సంవత్సరం అంతయు సువర్ణ మూర్తిగా 1/తను సంచారం. ఏలినాటి శని మధ్య భాగం, అనారోగ్య భారీ ఖర్చు, నిర్భందం, మరణ వార్తలు, ప్రమాదాలు, దూర ప్రయాణాలు, మానసిక ఆందోళన, దంపతుల వియోగం.


రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 లలో తామ్ర మూర్తిగా మీనం/కన్య లలో 1 తను/7కళత్ర సంచారం. అనారోగ్యం, గాయాలు, అవమానం, వ్యాపార చికాకులు, దంపతుల వియోగం. తదుపరి లోహ మూర్తిగా 12 వ్యయ/6 శత్రు సంచారం. అనారోగ్యం, నిర్బంధం, ప్రయాణాలు, కుటుంబ సాటి, దూర ప్రయాణాలు, శత్రువుల మీద జయం.


మొత్తంమీద పరీక్ష కాలమా అన్నట్లు ఉండును. నేర్పు, దైవబలం కొంత ఉపశమనం కలిగించును.

Aquarius Yearly

aquarius

Aquaries (కుంభం)

ధనిష్ఠ 2, శతభిషం 4, పూర్వాభాద్ర 3 పాదములు

ఈ రాశి వార్కి కష్ఠకాలం. ఏలినాటి శని ప్రభావం ఆఖరి పాదం మరియు ప్రమాదకరం. కొంత ఓపిక, ప్రణాళిక, క్రమశిక్షణ, జాగురుత అవసరం. ఇక వివరాలలోకి వెళ్తే’

 

గురుడు లాభ/ధన అధిపతి,  (4) మాతృ / (5) పుత్ర / 6  (శత్రు) / స్థానములలో లోహ తామ్ర రజత మూర్తిగా సంచారం లాభ దాయకం. ఇక వివరాలలోకి వెళ్తే


గురుడు 30/03/2025- 14/05/2025 లలో లోహ మూర్తిగా మాతృ స్థాన సంచారం. ప్రభుత్వ దండన, పదవి పోవుట, అపనిందలు, దగ్గర సంబంధీకుల మరణం, మనో వ్యథ, వస్తు నాశనం. తదుపరి 15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 లలో తామ్ర / రజత మూర్తిగా పుత్ర స్థాన సంచారం. పుత్ర, పౌత్ర లాభం, స్టిరాస్తి సమకూలన, అధికార లాభం, పండుగ, శుభ కార్యక్రమములు, ఉత్తమ విద్య, సామాజిక శుభ కార్యక్రమములు, కుటుంబ సౌఖ్యం. అత్యుత్తమ సమయం. ఇక 19/10/2025 – 05/12/2025 లలో లోహ మూర్తిగా శత్రు స్థాన సంచారం. అనారోగ్యం, మానసిక ఆందోళన, భారీ ఖర్చులు, ఆస్తి నష్టం. తగాదాలు.


శని సంవత్సరం అంతయు రజత మూర్తిగా ధన స్థాన సంచారం. ఏలినాటి శని ఆఖరి ఘట్టం. కుటుంబ కలహాలు, దంపతుల వియోగం, ఖర్చులు, బంధువుల మరణ వార్తలు, ఆర్ధిక ఇబ్బందులు. సంవత్సర ద్వితీయములో, కొంత ఉపశమనము. ఏలినాటి శని చివర భాగం.


రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 లలో మీనం/కన్య లలో 2ధన/8 ఆయు సంచారం. ప్రమాదాలు, కుటుంబ సభ్యులకు అనారోగ్యం, మనస్పర్థలు., ఆకస్మిత ఖర్చులు, సుఖ వ్యాధులు, అగౌరవం. తదుపరి కుంభ/ సింహ లలో రజత మూర్తిగా 1 తను/7 సింహ స్థాన సంచారం. అనారోగ్యం, గాయాలు, అవమానం, వ్యాపార చికాకులు, దంపతుల వియోగం.


మొత్తం మీద గురు సంచారం కలసి వచ్చేది. శని. రాహు/కేతు ఇబ్బందులు పెట్టిన, గురు బలంచేత, ఉపశమనం పొందుదురు.

Capricorn Yearly

capricorn

Capricorn (మకరం)

ఉత్తరాషాడ 3, శ్రవణం 4, ధనిష్ఠ 2 పాదములు

ఈ రాశి వార్కి అత్యుత్తమ ఫలితములు. అన్నిటా విజయములు. గౌరవ మర్యాదలు, పదవులు. ఏలినాటి శని ప్రభావం పోయి నూతన ఉత్సాహంతో పరుగులు తీస్తారు. ఆరోగ్యం మెరుగు పడును. ఇక వివరాలలోకి వెళ్తే’

 

గురుడు వ్యయ /భాతృ అధిపతి,  (5) పుత్ర / 6  (శత్రు) / 7  (కళత్ర) స్థానములలో సువర్ణ/రజత మూర్తిగా సంచారం వలన అద్భుత ఫలితాలు. తలచినదే తడువు, పట్టిందే బంగారం. ఇక వివరాలు

గురుడు 30/03/2025- 14/05/2025 లలో సువర్ణ మూర్తి గా పుత్ర స్థాన సంచారం. పుత్ర, పౌత్ర లాభం, స్టిరాస్తి సమకూలన, అధికార లాభం, పండుగ, శుభ కార్యక్రమములు, ఉత్తమ విద్య, సామాజిక శుభ కార్యక్రమములు, కుటుంబ సౌఖ్యం. అత్యుత్తమ సమయం. తదుపరి 15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 లలో శత్రు స్థాన సంచారం. అనారోగ్యం, మానసిక ఆందోళన, భారీ ఖర్చులు, ఆస్తి నష్టం. తగాదాలు. సువర్ణ మూర్తి కవుట వలన, కొంత ఉపశమనం. తదుపరి 19/10/2025 – 05/12/2025 లలో కళత్ర స్థాన సంచారం వాహన గృహ యోగం, స్థిరాస్తి కొనుగోలు, ఉత్తమ మైన కాలం. కళ్యాణ యోగం, గృహ సంతోషం, శుభకార్యాల సమయం.

 

శని సంవత్సరం అంతయు భాతృ స్థాన సంచారం. ఏలినాటి శని పూర్తిగా తొలగిపోయినది. వృత్తిలో పదోన్నతి, వ్యాపార బహు లాభం, స్థిర, చర్య ఆస్తులు కొనుగోలు, కుటుంబ సౌఖ్యం. న్యాయ పర విజయం, పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత. కళ్యాణ యోగం.

 

రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 లలో మీనం/కన్య లలో 3 భాతృ/9ధర్మ సంచారం. వ్యాపార లాభం, కుటుంబ ఆనందం, సేవకుల భాగ్యం, వృత్తిలో ఉన్నతి, తండ్రికి అనారోగ్యం, రక్త సంబంధ ఇబ్బందులు. ఆధ్యాత్మిక గురువులతో తగాదాలు. తదుపరి 2ధన/8 ఆయు స్థాన సంచారం. ప్రమాదాలు, కుటుంబ సభ్యులకు అనారోగ్యం, మనస్పర్థలు., ఆకస్మిత ఖర్చులు, సుఖ వ్యాధులు, అగౌరవం.

 

మొత్తం మీద, ప్రశాంతమైన జీవనం, విజయం, నిర్భయం. అనుభవించు రాజా అన్నట్టు ఉంటుంది.

Sagittarius Yearly

sagittairus

Sagittarius (ధనస్సు)

మూల 4, పూర్వాషాడ 4, ఉత్తరాషాడ 1 వ పాదములు

ఈ రాశి వార్కి రాజా యోగ/ఉత్తమ ఫలితములు. లీగల్ వ్యవహారాలలో విజయం, నూతన ఇల్లు కొనుగోలు. ఉత్తమమైన రాజకీయ ప్రస్థానం. వ్యవసాయదారులకు, వ్యాపాస్తులకు మంచి కాలం. ఇక వివరాలలోకి వెళ్తే’

 

గురుడు తనూ/మాతృ అధిపతి,  (6) శత్రు / 7  (కళత్ర) / 8 (ఆయు) స్థానములలో రజత / లోహ / తామ్ర మూర్తిగా సంచారం వలన మిశ్రమ ఫలితాలు. అధిక భాగం ఉత్తమ మైనది. ఇక వివరాలు

గురుడు 30/03/2025- 14/05/2025 లలో రజత మూర్తిగా శత్రు స్థాన సంచారం. అనారోగ్యం, మానసిక ఆందోళన, భారీ ఖర్చులు, ఆస్తి నష్టం. తగాదాలు. తదుపరి 15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 లలో కళత్ర స్థాన సంచారం. వాహన గృహ యోగం, స్థిరాస్తి కొనుగోలు, ఉత్తమ మైన కాలం. కళ్యాణ యోగం, గృహ సంతోషం, శుభకార్యాల సమయం. లోహ మూర్తి వలన కొంత లాభం తగ్గును. ఇక 19/10/2025 – 05/12/2025 లలో తామ్ర మూర్తిగా ఆయు స్థాన సంచారం. అనారోగ్యం, అధికముగా ఆహారం, మధు మ్యేహ వ్యాధి, నీరసం, అధిక ఖర్చు, మానసిక ఒత్తిడులు, అధికారులతో విభేదాలు, కేసులలో ఓటమి. వాహన గండం.

 

శని సంవత్సరం అంతయు లోహమూర్తిగా మాతృ స్థాన సంచారం. అర్థ అష్టమ శని. తల్లికి తీవ్ర అనారోగ్యం, ఖర్చులు, వాహన ప్రమాదాలు, కుటుంబ అసౌఖ్యం, దూర ప్రాంతములకు ప్రయాణం. పట్టుదల, క్రమశిక్షణ చాలా వరకు శ్రేయస్సు కలిగించును.

రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 లలో సువర్ణ మూర్తి గా మీనం/కన్య లలో 4 మాతృ/10 కర్మ స్థాన సంచారం. తల్లికి కష్ట కాలం, అధిక ఖర్చు, వాహన ప్రమాదం, ఆస్తి నష్టం, కుటుంబ కలహాలు, ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు, పదవి పోవుట. దూర ప్రయాణం. తదుపరి తామ్ర మూర్తిగా కుంభ/ సింహ లలో 3భాతృ/9ధర్మ స్థాన సంచారం. వ్యాపార లాభం, కుటుంబ ఆనందం, సేవకుల భాగ్యం, వృత్తిలో ఉన్నతి, తండ్రికి అనారోగ్యం, రక్త సంబంధ ఇబ్బందులు. ఆధ్యాత్మిక గురువులతో తగాదాలు.

మొత్తం మీద, దైవబలం, గ్రహ బలంతో ఉల్లాసమైన జీవనం గడుపుతారు. నూతన గృహ నిర్మాణం/స్థలాలు కొనుగోలు చేయు సూచనలు. మనోధైర్యం, చక్కటి కుటుంబ వాతావరణం.

Scorpio Yearly

libra

Scorpio (వృశ్చికం)

విశాఖ 1 వ, అనూరాధ 4, జ్యేష్ఠ 4 పాదములు

ఈ రాశి వార్కి మంచి ఫలితములు. విజయం, నూతన ఉత్సాహం, క్రొత్త వ్యాపారాలు మొదలగునవి కలసి వచ్చును. గడచిన రోజులు కన్నా బావుండును. వ్యవసాయదారులకు, వ్యాపాస్తులకు మంచి కాలం. ఇక వివరాలలోకి వెళ్తే’

గురుడు ధన/పుత్ర అధిపతి,  (7) కళత్ర  / 8  (ఆయు) / 9 (ధర్మ) స్థానములలో తామ్ర / సువర్ణ/ లోహ మూర్తిగా సంచారం వలన ఉత్తమ ఫలితాలు. కొంత వివాహం, పుత్ర విషయం లో అసహనం. ఇక వివరాలలోకి వెళ్తే

 

గురుడు 30/03/2025- 14/05/2025 లలో తామ్ర మూర్తిగా కళత్ర స్థాన సంచారం. వాహన గృహ యోగం, స్థిరాస్తి కొనుగోలు, ఉత్తమ మైన కాలం. కళ్యాణ యోగం, గృహ సంతోషం, శుభకార్యాల సమయం.

తదుపరి 15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 లలో సువర్ణ / లోహ మూర్తిగా ఆయు స్థాన సంచారం. అనారోగ్యం, అధికముగా ఆహారం, మధు మ్యేహ వ్యాధి, నీరసం, అధిక ఖర్చు, మానసిక ఒత్తిడులు, అధికారులతో విభేదాలు, కేసులలో ఓటమి. వాహన గండం. సువర్ణ మూర్తి కొంత లాభం చేకూర్చును.

తదుపరి 19/10/2025 – 05/12/2025 లలో సువర్ణ మూర్తిగా ధర్మ స్థాన సంచారం. పుత్ర లాభం, సంతాన యోగం, వంశాభివృద్ధి, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, లాభదాయకం, పదోన్నతి, మత పెద్దలు, దేశ/రాజ్య పెద్దలతో మంతనాలు. స్థాన చలనం.

 

శని సంవత్సరం అంతయు రజత మూర్తిగా పుత్ర స్థాన సంచారం. మానసిక ఆందోళనలు, కుటుంబం నుంచి దూరం, బంధువుల నుండి ప్రతికూలత, అధిక ఖర్చు, పిల్లలకు ఇబ్బందులు. కష్ట సమయం, ఆందోళన వదిలి, క్రమశిక్షణ అవసరం.

 

రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 లలో తామ్ర మూర్తిగా మీనం/కన్య లలో 5పుత్ర/11లాభ స్థాన సంచారం. మానసిక ఆందోళన, పిల్లలకు అరిష్టం, స్టిరాస్తుల విషయంలో కొంత నష్టం, కొంత లాభం, ఆభరణాలు ఖరీదు, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి.  తదుపరి లోహ మూర్తి గా కుంభ/ సింహ లలో 4 మాతృ/10 కర్మ స్థానాలలో సంచారం. తల్లికి కష్ట కాలం, అధిక ఖర్చు, వాహన ప్రమాదం, ఆస్తి నష్టం, కుటుంబ కలహాలు, ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు, పదవి పోవుట. దూర ప్రయాణం.

 

మొత్తం మీద గతంలో ఆగిన పనులు ఈ సంవత్సరం అవుటకు సూచనలు. స్వశక్తి తో ముందుకు పొగలరు.

Libra Yearly

libra

Libra (తుల)

చిత్ర 2, స్వాతి 4, విశాఖ 3 పాదములు

ఈ రాశి వార్కి మంచి ఫలితములు. ధనం, సంపత్తు, ఆరోగ్యం, పుత్రాభివృద్ధి, దైవ బలం మెండుగా ఉండును. వ్యవసాయదారులకు, వ్యాపాస్తులకు మంచి కాలం. ఇక వివరాలలోకి వెళ్తే’

గురుడు భాతృ/శత్రు అధిపతి,  (8) ఆయు /9 (ధర్మ) / 10(కర్మ) స్థానములలో లోహ / రజత మూర్తిగా సంచారం వలన ఉత్తమ ఫలితాలు. అన్నిటా విజయం, లాభం. ఇక వివరాలలోకి వెళ్తే

గురుడు 30/03/2025- 14/05/2025 లలో లోహ మూర్తిగా ఆయు స్థాన సంచారం. అనారోగ్యం, అధికముగా ఆహారం, మధు మ్యేహ వ్యాధి, నీరసం, అధిక ఖర్చు, మానసిక ఒత్తిడులు, అధికారులతో విభేదాలు, కేసులలో ఓటమి. వాహన గండం.

15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 లలో రజత మూర్తిగా ధర్మ స్థాన సంచారం. పుత్ర లాభం, సంతాన యోగం, వంశాభివృద్ధి, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, లాభదాయకం, పదోన్నతి, మతపెద్దలు, దేశ/రాజ్య పెద్దలతో మంతనాలు. స్థాన చలనం.

19/10/2025 – 05/12/2025 లలో లోహ మూర్తిగా కర్మ స్థాన సంచారం. అధికారుల నుండి ఆపద/అవమానం, పదవులు పోవుట, ఉద్యోగం లో చిన్న చూపు, వృధా ప్రయాస ప్రయాణాలు, స్థాన మార్పు, నీరసం.

 

శని సంవత్సరం అంతయు సువర్ణ మూర్తిగా శత్రు స్థాన సంచారం. పోటీ పరీక్షలలో విజయం, కేసులలో విజయం, కళ్యాణం, ఆస్తి సంపాదన, ఉత్తమ కాలం, కుటుంబ సంతోషం. ఆరోగ్యం మెరుగుపడును. కోర్టు వ్యవహారాలలో విజయం.

 

రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 లలో లోహ మూర్తి గా 6శత్రు/12వ్యయ సంచారం. పోటీ పరీక్షలు, న్యాయపర విషయాలలో, విజయం, ఆస్తి లాభం, ఆర్జన, కుటుంబ సంతోషాలు, ఆధ్యమిక ప్రదేశాల దర్శనం, ఖర్చు, కొంత అనారోగ్యం. తదుపరి 5 పుత్ర/11 లాభ స్థాన సంచారం. మానసిక ఆందోళన, పిల్లలకు అరిష్టం, స్టిరాస్తుల విషయంలో కొంత నష్టం, కొంత లాభం, ఆభరణాలు ఖరీదు, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి.

 

మొత్తం మీద, పాత బాధలు తొలగి, ధైర్యంతో విజయం సాధిస్తారు.   

Virgo Yearly

Virgo (కన్య)

ఉత్తర 3, హస్త 4, చిత్ర 2 పాదములు

ఈ రాశివార్కి మిశ్రమ ఫలితాలు. ఊహించని లాభాలు. రాజకీయ, వర్తక, బ్యాంకింగ్, షేర్ మార్కెట్ వారికి ఉత్తమ లాభాలు. వ్యవసాయదారులకు మిశ్రమ లాభాలు. ఇక వివరాలలోకి వెళ్తే’

 

గురుడు మాతృ/కళత్ర అధిపతి,  (9) ధర్మ /10 (కర్మ) / 11(లాభ) స్థానములలో రజత/తామ్ర/సువర్ణ మూర్తిగా సంచారం వలన ఉత్తమ ఫలితాలు. అన్నిటా విజయం, సౌఖ్యం. ఇక వివరాలలోకి వెళ్తే

గురుడు 30/03/2025- 14/05/2025 రజత మూర్తిగా ధర్మ స్థాన సంచారం. పుత్ర లాభం, సంతాన యోగం, వంశాభివృద్ధి, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, లాభదాయకం, పదోన్నతి, మత పెద్దలు, దేశ/రాజ్య పెద్దలతో మంతనాలు. స్థాన చలనం.

15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 తామ్ర మూర్తిగా కర్మ స్థాన సంచారం. అధికారుల నుండి ఆపద/అవమానం, పదవులు పోవుట, ఉద్యోగం లో చిన్న చూపు, వృధా ప్రయాస ప్రయాణాలు, స్థాన మార్పు, నీరసం.

19/10/2025 – 05/12/2025 సువర్ణ మూర్తిగా లాభ స్థాన సంచారం. కళ్యాణం, కార్య సిద్ధి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ నియామకాలు, గుర్తింపు, ఆస్తి సంపాదన, సమ కూర్పు, కుటుంబ సంతోషాలు. సర్వ శుభ యోగం.

 

శని సంవత్సరం అంతయు తామ్ర మూర్తిగా కళత్ర స్థాన సంచారం. అధిక ఖర్చు, అనారోగ్యం, వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, దంపతుల వియోగం. క్రమశిక్షణ, పారదర్శకత అవసరం. దంపతులు ఇరువురు చర్చించి తీసుకున్న నిర్ణయాలు విశేషంగా ఫలించును. ఇది వ్యాపారములో భాగస్వాములకు కూడా వర్తించును.

 

రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 రజత మూర్తిగా 7 కళత్ర /1తనూ భావ సంచారం. వ్యాపార నష్టం, మానసిక ఆందోళన, శత్రు భయం, అధిక ప్రయాణాలు, దంపతుల ఎడబాటు, రక్త సంబంధ వ్యాధులు, ఆకస్మిక ప్రయాణాలు. సువర్ణ మూతి కావున, కొంత ఉపశమనం. తదుపరి తామ్ర మూర్తిగా 6శత్రు/12వ్యయ  భావ సంచారం. పోటీ పరీక్షలు, న్యాయపర విషయాలలో, విజయం, ఆస్తి లాభం, ఆర్జన, కుటుంబ సంతోషాలు, ఆధ్యమిక ప్రదేశాల దర్శనం, ఖర్చు, కొంత అనారోగ్యం.

 

మొత్తం మీద పాత బాధలు పోయి ఉల్లాసంగా లాభసాటిగా ఉండును.

Leo Yearly

leo

Leo (సింహం)

మఘ 4, పుబ్బ 4, ఉత్తర 1 వ పాదములు

ఈ రాశివార్కి అంతగా కలసి వచ్చేది కాదు. శుభఅశుభ మిశ్రమ ఫలితములు. ధానాదాయం, పనిలో గుర్తింపు. ఉత్తమ సమయం విద్యలో. వ్యవసాయదారులకు కొంత ప్రతికూల పరిస్తుతులు. ధరలు గిట్టుబాటు కాకపోవచ్చు. ఇక వివరాలలోకి వెళ్తే’


గురుడు పుత్ర/ఆయు అధిపతి,  (10) కర్మ /11 (లాభ) / 12(వ్యయ) స్థానములలో సువర్ణ / లోహ / రజత మూర్తిగా సంచారం వలన ఉత్తమ ఫలితాలు.

30/03/2025- 14/05/2025 సువర్ణ మూర్తిగా కర్మ స్థాన సంచారం. అధికారుల నుండి ఆపద/అవమానం, పదవులు పోవుట, ఉద్యోగం లో చిన్న చూపు, వృధా ప్రయాస ప్రయాణాలు, స్థాన మార్పు, నీరసం. సువర్ణ మూర్తి కావున కొంత ఉపశమనం.


15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 లలో లాభ స్థాన సంచారం. కళ్యాణం, కార్య సిద్ధి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ నియామకాలు, గుర్తింపు, ఆస్తి సంపాదన, సమకూర్పు, కుటుంబ సంతోషాలు. సర్వ శుభ యోగం. ప్రేమ వ్యవహారాలు, ధన ప్రాప్తి, సంతాన ప్రాప్తి. 19/10/2025 – 05/12/2025 లలో వ్యయ స్థాన సంచారం. అనారోగ్యము, నిర్భందం, ఖర్చు, దంపతుల మధ్య మనస్పర్థలు, నష్టం, దూర ప్రయాణములు, అత్యంత ప్రమాద స్థితి.


శని సంవత్సరం అంతయు లోహ మూర్తిగా ఆయు స్థాన సంచారం. అష్టమ శని. అవమానం, ప్రమాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి నష్టం, సుఖవ్యాధులు, భార్యా/భర్త తీవ్ర అనారోగ్యం. కోర్టు వ్యవహారాలు కలసి వచ్చును. ఆకస్మిక లాభాలు, క్రమశిక్షణ మంచి ఫలితాలు ఇవ్వగలదు.


30/03/2025 – 29/05/2025 లలో తామ్ర మూర్తిగా ఆయు/ ధన స్థాన సంచారం. అనారోగ్యం, అతి ప్రమాద సమయం, ఆకస్మిక ప్రమాదాలు, అనారోగ్యం, కఠిన మాట, అధిక ఖర్చు, కుటుంబ కలహాలు, ఆస్తి నష్టం. తదుపరి సువర్ణ మూర్తిగా 7కళత్ర/1తనూ భావ సంచారం. వ్యాపార నష్టం, మానసిక ఆందోళన, శత్రు భయం, అధిక ప్రయాణాలు, దంపతుల ఎడబాటు, రక్త సంబంధ వ్యాధులు, ఆకస్మిక ప్రయాణాలు. సువర్ణ మూతి కావున, కొంత ఉపశమనం. రాహు సంచారం కలసి వచ్చును. ప్రజా జీవనం లోని వ్యక్తులకు మంచి సమయం. క్రీడాకారులకు కలసివచ్చను.

మొత్తం మీద ఒడిదొడికులతో కూడిన సంవత్సరం.

Cancer Yearly

Cancer (కర్కాటకం)

పునర్వసు 4వ, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదములు

సాధారణ ఫలితములు. ఆకస్మిత లాభాలు, కొంత సమస్యలు. అన్ని రంగముల వారికి సౌఖ్యం ముఖ్యముగా doctors, నేవీ, సముద్ర యానం, నీటి మీద వ్యాపారస్తులకు అధిక లాభాలు. క్రొత్త ఉద్యోగాలు, క్రొత్త ఉపాధులు వస్తాయి. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలాలు. ఇక వివరాలలో వెళ్తే

గురుడు శత్రు/ధర్మ అధిపతి,  (11) లాభ /12 (వ్యయ) / 1(తనూ) స్థానములలో తామ్ర / రజత / లోహ మూర్తిగా సంచారం వలన సాధారణ ఫలితాలు.


30/03/2025- 14/05/2025 తామర మూర్తిగా లాభ స్థానంలో సంచారం. కళ్యాణం, కార్య సిద్ధి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ నియామకాలు, గుర్తింపు, ఆస్తి సంపాదన, సమకూర్పు, కుటుంబ సంతోషాలు. సర్వ శుభ యోగం.


15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 లలో రజత /లోహ మూర్తిగా వ్యయ భావములో సంచారం, అనారోగ్యము, నిర్భందం, ఖర్చు, దంపతుల మధ్య మనస్పర్థలు, నష్టం, దూర ప్రయాణములు, అత్యంత ప్రమాద స్థితి. లోహ మూర్తి కావున, ఫలితాలు మరింత ఇబ్బందిగా ఉండును. శుభకార్యములకు ధన ఖర్చు.


19/10/2025 – 05/12/2025 లలో తామ్ర మూర్తిగా తానూ బావ సంచారం భారీ ఖర్చు, పనిలో ఆటంకాలు, అగౌరవము, ఆస్తి నష్టం, మనస్పర్థలు, అహంకారం. ఆరోగ్యం కుడుటపడుతుంది. గృహములో సంతోషాలు, శుభకార్యాలు.

 

శని సంవత్సరం అంతయు రజత మూర్తిగా ధర్మ స్థాన సంచారం. గత 2 ½ ఏండ్లుగా ఉన్న కష్టాలు తొలగును. వృత్తి లో, వ్యాపారము లో, వ్యవసాయము లో ఆటంకాలు ఎదురు అయినా, నిర్దిష్టమైన ప్రణాళికా, క్రమశిక్షణతో విజయం సాధించగలరు. గృహ సంబంధ ఇబ్బందులు, న్యాయపర ప్రతికూలత, క్రొత్తగా చేపట్టిన పనులు ఆలస్యమవును. క్రమశిక్షణ తో పరిస్థితులు అనుకూలం. ధర్మ బద్దమైన పనులకు అనుకూలం.


రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 సువర్ణ మూర్తిగా మీనం/కన్య లలో సంచారం, ఆపదలు, వృత్తిలో అసౌకర్యం, కొంత ఆనందము, అపరకర్మ యోగము. వ్యాపార లాభం, కోర్టు కేసులలో విజయం, అన్నదమ్ముల నుండి లాభం, సుఖం. తదుపరి లోహ మూర్తిగా కుంభ/ సింహ సంచారం.

అనారోగ్యం, అతి ప్రమాద సమయం, ఆకస్మిక ప్రమాదాలు, అనారోగ్యం, కఠిన మాట, అధిక ఖర్చు, కుటుంబ కలహాలు, ఆస్తి నష్టం.

 

మొత్తం మీద సాధారణ ఫలితములు. క్రమశిక్షణ, చాలా మంచి ఫలితములను ఇవ్వగలదు.

Gemini Yearly

gemini

Gemini (మిథునం)

మృగశిర 2, ఆర్ద్ర 4, పునర్వసు 3 పాదములు

మీ పంతం నెరవేరే కాలం. మంచి ఆలోచనా శక్తి, శక్తికి మించిన పనులు చేయుట వలన కీర్తి, గౌరవం లభించును. ఆరోగ్యం, సంతానం, వివాహం, సమాజ గౌరవం మెండుగా ఉండును. ఊహించని సమస్యలు, పుణ్య క్షేత్ర దర్శనం ఉండును. వ్యవసాయదారులు కొంత మేలుకువతో లాభించగలరు. గురువులు, అధికారులు సామర్థ్యాలు పెంచుకోవలసిన సమయం. ఇక వివరాల లోకి వెళ్తే


గురుడు కళత్ర, కర్మ అధిపతి 12 (వ్యయ) / 1(తనూ)/ 2(ధన) స్థానములలో సువర్ణ, లోహ మూర్తిగా సంచారం వలన మిశ్రమ ఫలితాలు.

30/03/2025- 14/05/2025 లలో లోహ మూర్తిగా వ్యయ స్థాన సంచారం. అనారోగ్యము, నిర్భందం, ఖర్చు, దంపతుల మధ్య మనస్పర్థలు, నష్టం, దూర ప్రయాణములు, అత్యంత ప్రమాద స్థితి.


15/05/2025–18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 లలో సువర్ణ మూర్తి గా తనూ స్థాన సంచారం. భారీ ఖర్చు, పనిలో ఆటంకాలు, అగౌరవము, ఆస్తి నష్టం, మనస్పర్థలు, అహంకారం. సువర్ణ మూర్తి, కొంత వక్ర రీతి వలన, ఇబ్బందులు కొంత వరకు తగ్గును.


19/10/2025 – 05/12/2025 లలో లోహ మూర్తిగా ధన స్థాన సంచారం. కళ్యాణ యోగం. పండుగ వాతావారణం, ఉద్యోగం, పదోన్నతి, అన్నిటా విజయం, వస్తు కనక వాహన ప్రాప్తి. కీర్తి, గౌరవం. సంతాన ప్రాప్తి. తామ్ర మూర్తి కావున ఉత్తమ ఫలితాలు.

 

శని సంవత్సరమంతయు తామ్ర మూర్తిగా కర్మ స్థాన సంచారం. వ్యాపార నష్టం, అధికారులు, ప్రభుత్వం నుండి చికాకులు, సంవత్సర మధ్య నుండి స్థల మార్పిడి, ఉద్యోగ అభివృద్ధి. శ్రమకు తగ్గ ఫలితములు కొంచెం ఆలస్యముగా వచ్చును. క్రమశిక్షణ అవసరము. అనుకున్న పనులు అన్నియూ కొంత ఆలస్యంగా పూర్తి అవును. చిన్న ఉద్యోగులకు శ్రేష్ఠ కాలం.


 రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 లలో మీనం/కన్య సంచారం, వృత్తిలో విజయం, అనుకూలం, స్థల మార్పిడి, కొంత అనారోగ్యం, తల్లికి అగౌరవము, అనారోగ్యము. తదుపరి కుంభ/ సింహ రాసులలో 9 ధర్మ/3భాతృ స్థాన సంచారం. ఆపదలు, వృత్తిలో అసౌకర్యం, కొంత ఆనందము, అపరకర్మ యోగము. వ్యాపార లాభం, కోర్టు కేసులలో విజయం, అన్నదమ్ముల నుండి లాభం, సుఖం.


మొత్తం మీద, ఈ సంవత్సరం, గ్రహముల అనుకూల/ప్రతికూల ప్రభావం చేత మిశ్రమంగా ఉండును. అధిక భాగం మీ మాటకు ఎదురు లేకపోవుట, పంతం నెరవేరుట, సంఘంలో మర్యాద ఇత్యాది శుభములు కల్గును.