Scorpio (వృశ్చికం)
విశాఖ 1 వ, అనూరాధ 4, జ్యేష్ఠ 4 పాదములు
విశాఖ 1 వ, అనూరాధ 4, జ్యేష్ఠ 4 పాదములు
ఈ రాశి వార్కి మంచి ఫలితములు. విజయం, నూతన ఉత్సాహం, క్రొత్త వ్యాపారాలు మొదలగునవి కలసి వచ్చును. గడచిన రోజులు కన్నా బావుండును. వ్యవసాయదారులకు, వ్యాపాస్తులకు మంచి కాలం. ఇక వివరాలలోకి వెళ్తే’
గురుడు ధన/పుత్ర అధిపతి, (7) కళత్ర / 8 (ఆయు) / 9 (ధర్మ) స్థానములలో తామ్ర / సువర్ణ/ లోహ మూర్తిగా సంచారం వలన ఉత్తమ ఫలితాలు. కొంత వివాహం, పుత్ర విషయం లో అసహనం. ఇక వివరాలలోకి వెళ్తే
గురుడు 30/03/2025- 14/05/2025 లలో తామ్ర మూర్తిగా కళత్ర స్థాన సంచారం. వాహన గృహ యోగం, స్థిరాస్తి కొనుగోలు, ఉత్తమ మైన కాలం. కళ్యాణ యోగం, గృహ సంతోషం, శుభకార్యాల సమయం.
తదుపరి 15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 లలో సువర్ణ / లోహ మూర్తిగా ఆయు స్థాన సంచారం. అనారోగ్యం, అధికముగా ఆహారం, మధు మ్యేహ వ్యాధి, నీరసం, అధిక ఖర్చు, మానసిక ఒత్తిడులు, అధికారులతో విభేదాలు, కేసులలో ఓటమి. వాహన గండం. సువర్ణ మూర్తి కొంత లాభం చేకూర్చును.
తదుపరి 19/10/2025 – 05/12/2025 లలో సువర్ణ మూర్తిగా ధర్మ స్థాన సంచారం. పుత్ర లాభం, సంతాన యోగం, వంశాభివృద్ధి, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, లాభదాయకం, పదోన్నతి, మత పెద్దలు, దేశ/రాజ్య పెద్దలతో మంతనాలు. స్థాన చలనం.
శని సంవత్సరం అంతయు రజత మూర్తిగా పుత్ర స్థాన సంచారం. మానసిక ఆందోళనలు, కుటుంబం నుంచి దూరం, బంధువుల నుండి ప్రతికూలత, అధిక ఖర్చు, పిల్లలకు ఇబ్బందులు. కష్ట సమయం, ఆందోళన వదిలి, క్రమశిక్షణ అవసరం.
రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 లలో తామ్ర మూర్తిగా మీనం/కన్య లలో 5పుత్ర/11లాభ స్థాన సంచారం. మానసిక ఆందోళన, పిల్లలకు అరిష్టం, స్టిరాస్తుల విషయంలో కొంత నష్టం, కొంత లాభం, ఆభరణాలు ఖరీదు, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి. తదుపరి లోహ మూర్తి గా కుంభ/ సింహ లలో 4 మాతృ/10 కర్మ స్థానాలలో సంచారం. తల్లికి కష్ట కాలం, అధిక ఖర్చు, వాహన ప్రమాదం, ఆస్తి నష్టం, కుటుంబ కలహాలు, ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు, పదవి పోవుట. దూర ప్రయాణం.
మొత్తం మీద గతంలో ఆగిన పనులు ఈ సంవత్సరం అవుటకు సూచనలు. స్వశక్తి తో ముందుకు పొగలరు.