loading

Zodiac Sign Yearly Predictions

  • Home
  • Zodiac Sign Yearly Predictions

Yearly Horoscope Predictions (Parabhava naama Samvatsram)

aries

Aries (మేషం)

ఆశ్విని 4 , భరణి4 , కృత్తిక 1 వ పాదం

ఏలినాటి శని ప్రారంభమై ద్వితీయ సంవత్సరం. అన్నీ విధములగా ప్రతికూల సమయం. అత్యంత క్రమ శిక్షణ అవసరము. గురు సంచారం కూడా అంతగా కలసిరాదు. సంవత్సర మధ్యలో కొంత లాభం. రాహు కేతు నవంబర్ నెల వరకు మంచి ఫలితములు ఇచ్చును.

కొంత వివరంగా చూస్తే, రాహు కేతు సంచారం నవంబర్ చివరి వరకు ఉత్తమం. ఉత్తమ సమయం, ఉత్తమ ఆహారం, గౌరవం, ఆరోగ్యం, లాభాలు. స్వల్ప అనారోగాలు, జీవిత భాగస్వామి సుఖం. ఆలోచనా శక్తి, ఉత్తమ అభ్యాసనలు. 

గురు సంచారం నవంబర్ నుంచి జనవరి వరకు అత్యంత శుభం. ఆనందకర, యోగ్యకర సమయము. బహు శుభకార్యములు, విద్య, ఉద్యోగ/వ్యాపార అభివృద్ధి, కనక, వాస్తు, వాహన లాభం. దానములు, సేవ, విశేష శుభ కార్యములు. 

ఏలినాటి శని 2వ సంవత్సరం. ఉద్యోగ వ్యాపారాలలో అసంతృప్తి, నష్టాలు. అధిక ధన వ్యయము. పాడిపశు నాశనం, ప్రయాణాలు, కుటుంబము నుండి దూరం, ఆవేదన, ఆలోచనలు, పేదరికం. విఫల ప్రయత్నాలు. కష్టపడి సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఉత్తమ ఫలితాలు.

రైతులు మరియు వ్యాపారస్తులు: అత్యంత శ్రమతో కూడిన సంవత్సరం. పశు పాలన, వ్యాపారం కొంత అనుకూలం కాదు. రాహు ప్రభావం, నవంబర్ వరకు అత్యంత అనుకూలం. తదుపరి, సంశయనం అవసరం. అధిక ఆశ నష్టానికి దారి తీయును. Speculations, బెట్టింగ్, షేర్ ట్రేడింగ్ బహు జాగురత.

ఉద్యోగస్థులు మరియు అధికారులు: ఉన్నత స్థానం, బదిలీలు జూన్ ముందు సూచన. జూన్ నుంచి నవంబర్ వరకు కొంత consolidation ఫేజ్. కొత్త పరిస్తుతులకు అలవాటు పడాలి. నవంబర్ నుంచి జనవరి లోపు, చాలా మంచి సమయం.

స్త్రీలు మరియు పిల్లలు: నవంబర్ వరకు బాగుండును. కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఉత్తమం. తదుపరి కొంత కలహములు, మనస్పర్థలు. అనవసర భయాలు మానుకోవాలి. క్రమ శిక్షణ బహు అవసరం. డ్రగ్స్ జోలికి పోవలదు.

గురువులు మరియు పెద్దలు: వీరకి అంత్యంత శ్రమ మరియు బాధ్యత కల్గిన సంవత్సరం. నవంబర్ తరువాత ఆరోగ్యం కొంత కలత చేసును. 

దేవుని పట్ల భక్తి పెరుగుదల ఉన్నాయి. శనీశ్వర అభిషేకములు, హనుమాన్ చాలీసా పఠనం, అన్న, వస్త్ర దానం, పెద్దలకు సేవ విడవకుండా చేయుట ఉపయుక్తమైనది.

taurus

Taurus (వృషభం)

కృత్తిక 3, రోహిణి 4, మృగశిర 2 పాదములు

అన్నివిధములా కలిసి వచ్చే కాలం. గురు సంచారం జూన్ వరకు ఉత్తమం. తదుపరి మిశ్రమం. శని సంచారం బహు శుభం. రాహు కేతు మిశ్రమం.

కొంత వివరంగా చూస్తే, రాహు కేతు సంచారం నవంబర్ చివరి వరకు ఉత్తమం. వృత్తిలో విజయం, అనుకూలం, స్థల మార్పిడి, కొంత అనారోగ్యం, తల్లికి అగౌరవము, అనారోగ్యము ఉన్ననూ చివరికి అనుకూలం. తదుపరి చిన్న ఆపదలు, వృత్తిలో అసౌకర్యం, అపరకర్మ యోగము. మొత్తంగా వ్యాపార లాభం, కోర్టు కేసులలో విజయం, అన్నదమ్ముల నుండి లాభం, సుఖం. 

గురు సంచారం జూన్ వరకు అత్యంత శుభం. ఆనందకర, యోగ్యకర సమయము. బహు శుభకార్యములు, విద్య, ఉద్యోగ/వ్యాపార అభివృద్ధి, కనక, వాస్తు, వాహన లాభం. దానములు, సేవ, విశేష శుభ కార్యములు. తదుపరి ఇబ్బంది కరం. ఉద్యోగ / వ్యాపార నష్టాలు, అవమానం, ప్రమాదాలు, దూర ప్రయాణాలు. లాటరీలు, షేర్ మార్కెట్లో షార్ట్ ట్రేడ్ వంటివి కలసిరావు. ఆకస్మిక దాడులు, గాయాలు జరుగు సూచనలు. కుటుంబ వ్యవహారాలు క్లిష్టమైనవి.     

శని 11 సంచారం. కళ్యాణం, పుత్ర, పౌత్ర, కనక, వస్తు లాభం, ప్రభుత్వము నుండి లాభం. వ్యాపారము లాభసాటి. సమాజ గౌరవము.

రైతులు మరియు వ్యాపారస్తులు: అత్యంత అనుకూల సంవత్సరం. ట్రేడింగ్లో మంచి లాభాలు. అధిక ప్రయాణాలు, కుటుంబ భాద్యతలు. రాహు ప్రభావం, నవంబర్ వరకు అత్యంత అనుకూలం. తదుపరి, సంశయనం అవసరం. కోర్టు వ్యవహారాలు అనుకూలం. అన్నదమ్ముల నుండి మంచి సహకారం మరియు లాభం.

ఉద్యోగస్థులు మరియు అధికారులు: ఉన్నత స్థానం, బదిలీలు జూన్ ముందు సూచన. తదుపరి ఇబ్బంది. అధికారుల suchana, పాలన చాలా వరకు ఉపయుక్తం. సెల్ఫ్ ఇగో పక్కన పెట్టవలెను. శ్రమ అధికము.

స్త్రీలు మరియు పిల్లలు: మంచి కాలం. పూజలు నోములు దైవ కార్యములకు బాగుగా ఉండును. ఆటలకు విశేషంగా కలసి వచ్చును. క్రమ శిక్షణ బహు అవసరం. వీరు కూడా, గురు బలం చేకూర్చుకొనవలెను.

గురువులు మరియు పెద్దలు: వీరకి ఆరోగ్యం, శుభం మరియు సుఖ కాలం. కొంత శ్రమ పెరగును. ఆశ ఇబ్బంది పెట్టును.

సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, నవదుర్గా పూజలు, వేంకటేశ్వర స్వామి దర్శనం బహు విశేషముగా శుభ ఫలితములు ఇచ్చును. అన్న దానం చేయవలెను.

gemini

Gemini (మిథునం)

మృగశిర 2, ఆర్ద్ర 4, పునర్వసు 3 పాదములు

మిశ్రమ కాలం. గురు సంచారం సంవత్సర మధ్యలో అనుకూలం. శని బహు ఇబ్బందులు కలుగచేసిననూ మంచి ఫలితాన్ని ఇచ్చును. రాహు కేతు కొంత ఇబ్బంది పెట్టును అదే సమయములో విశేష ఉపకారం చేయును.

కొంత వివరంగా చూస్తే, రాహు కేతు సంచారం నవంబర్ చివరి వరకు ఉత్తమం. ఆనందము. వ్యాపార లాభం, కోర్టు కేసులలో విజయం, అన్నదమ్ముల నుండి లాభం, సుఖం. తదుపరి అనారోగ్యం, అతి ప్రమాద సమయం, ఆకస్మిక ప్రమాదాలు, అనారోగ్యం, కఠిన మాట, అధిక ఖర్చు, కుటుంబ కలహాలు, ఆస్తి నష్టం. ఆరోగ్య హీనత, దుఃఖం, బంధువులకు (తండ్రి లేదా సహోదరులకు) ప్రమాదం.

గురు సంచారం జూన్ తరువాత అత్యంత శుభం. కళ్యాణ యోగం. పండుగ వాతావారణం, ఉద్యోగం, పదోన్నతి, అన్నిటా విజయం, వస్తు కనక వాహన ప్రాప్తి. కీర్తి, గౌరవం. సంతాన ప్రాప్తి. తామ్ర మూర్తి కావున ఉత్తమ ఫలితాలు. తదుపరి ఇబ్బంది కరం. అనారోగ్యము, అధిక ఖర్చు, శ్రమతో కూడిన వృధా ప్రయాణములు. బదిలీలు, స్థల మార్పిడి. విశేష వ్యథ.

శని 10 సంచారం. వ్యాపార నష్టం, అధికారులు, ప్రభుత్వం నుండి చికాకులు, సంవత్సర మధ్య నుండి స్థల మార్పిడి, ఉద్యోగ అభివృద్ధి. శ్రమకు తగ్గ ఫలితములు కొంచెం అలస్యముగా వచ్చును. క్రమశిక్షణ అవసరము.

రైతులు మరియు వ్యాపారస్తులు: అత్యంత మిశ్రమ సంవత్సరం. ట్రేడింగ్లో సామాన్య లాభాలు. Consulting వారికి బహు అనుకూలం. రాహు ప్రభావం, నవంబర్ వరకు అత్యంత అనుకూలం. తదుపరి, సంశయనం అవసరం. కోర్టు వ్యవహారాలు అనుకూలం. అన్నదమ్ముల నుండి మంచి సహకారం మరియు లాభం. శ్రమకు తగ్గ ఫలితములు వచ్చును.

ఉద్యోగస్థులు మరియు అధికారులు: ఉన్నత స్థానం, బదిలీలు జూన్ తరువాత సూచన. డిసెంబర్ తదుపరి ఇబ్బంది. ఉత్తమ వాహన యోగం. శ్రమ ఎక్కువ ఫలితములు ఆశించిన విధముగా ఉండవు.

స్త్రీలు మరియు పిల్లలు: మిశ్రమ కాలం. పనికిరాని శ్రమ, ఆశాభంగం. అన్నీ విధముల వీరు, ఓపిక పట్టవలెను. మాట కటినంగా ఉండును, దానిని సరిచేసుకొనవలెను. క్రమ శిక్షణ బహు అవసరం. వీరు కూడా, గురు బలం చేకూర్చుకొనవలెను.

గురువులు మరియు పెద్దలు: సంవత్సర మధ్య శుభం మరియు సుఖ కాలం. జూన్ ముందు, వీరు అనవసర విషయాల జోలికి పోరాదు. కొంత శ్రమ పెరగును. ఆశ ఇబ్బంది పెట్టును. దైవ బలం చాలా అవసరం.

హనుమాన్ చాలీసా లేక సుందరకాండ పఠనం విశేషముగా పనిచేయును.

Cancer (కర్కాటకం)

పునర్వసు 4వ, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదములు

ఇబ్బంది కాలం. గురు సంచారం సంవత్సర చివర్లో అనుకూలం. శని వ్యావహారిక ఇబ్బందులు కలుగచేసిననూ మంచి ఆధ్యాత్మిక ఫలితాన్ని ఇచ్చును. రాహు కేతు కొంత ఇబ్బంది పెట్టును.

కొంత వివరంగా చూస్తే, రాహు కేతు సంచారం సంవత్సరం అంతయు అంతగా ఫలించాడు. అనారోగ్యం, అతి ప్రమాద సమయం, ఆకస్మిక ప్రమాదాలు, అనారోగ్యం, కఠిన మాట, అధిక ఖర్చు, కుటుంబ కలహాలు, ఆస్తి నష్టం. వ్యాపార నష్టం, మానసిక ఆందోళన, శత్రు భయం, అధిక ప్రయాణాలు, దంపతుల ఎడబాటు, రక్త సంబంధ వ్యాధులు, ఆకస్మిక ప్రయాణాలు. సువర్ణ మూర్తి కావున, కొంత ఉపశమనం. 

గురు సంచారం నవంబర్ నుంచి జనవరి వరకు అత్యంత శుభం. కళ్యాణ యోగం. పండుగ వాతావారణం, ఉద్యోగం, పదోన్నతి, అన్నిటా విజయం, వస్తు కనక వాహన ప్రాప్తి. కీర్తి, గౌరవం. సంతాన ప్రాప్తి. తామ్ర మూర్తి కావున ఉత్తమ ఫలితాలు. అంతకు ముందు అంత శుభము కాదు. భారీ ఖర్చు, పనిలో ఆటంకాలు, అగౌరవము, ఆస్తి నష్టం, మనస్పర్థలు, అహంకారం.

శని 9 సంచారం. వృత్తిలో, వ్యాపారములో, వ్యవసాయములో ఆటంకాలు, గృహ సంబంధ ఇబ్బందులు, న్యాయపర ప్రతికూలత, క్రొత్తగా చేపట్టిన పనులు కలసిరావు. క్రమశిక్షణ తో పరిస్థితులు అనుకూలం. ధర్మ బద్దమైన పనులకు అనుకూలం. శ్రమకు తగ్గ ఫలితములు కొంచెం అలస్యముగా వచ్చును. క్రమశిక్షణ అవసరము.

రైతులు మరియు వ్యాపారస్తులు: అత్యంత క్లిష్ట సంవత్సరం. ట్రేడింగ్లో సామాన్య లాభాలు. పశు పాలన లాభదాయకం. నల్లని వస్తువులు, నల్లని పంటలు బాగుండును. రాహు ప్రభావం, ఆకస్మిక నష్టాలు. గృహ సంబంధ విషయాలలో ఓపిక అవసరం. శ్రమకు తగ్గ ఫలితములు వచ్చును.

ఉద్యోగస్థులు మరియు అధికారులు: ఉన్నత స్థానం, బదిలీలు నవంబర్ తరువాత సూచన. అన్నిటా శుభదాయకం. దూర ప్రయాణములు, అనుకోని ఇబ్బందులు కల్గవచ్చు. నిబంధల ప్రకారం నడుచుకోవలెను.  

స్త్రీలు మరియు పిల్లలు: మానసిక ఆందోళన అనవసర శ్రమ. కుటుంబ కలహాలు ఉన్నా అవసరమైన సమయానికి నిలబడుట ప్రత్యేకత. పిల్లలు చదువులో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇంట విశేషమైన శుభ కార్యాలు.

గురువులు మరియు పెద్దలు: సంవత్సర చివర శుభం మరియు సుఖ కాలం. ధర్మ బద్ధ జీవితం అవసరం. పిల్లలకు మీ మార్గదర్శనం అవసరం. ఆరోగ్యం చాలా మేరకు ఇబ్బంది పెట్టును. దైవ బలం చాలా అవసరం.

అమ్మవారిని విశేషముగా పూజించటం, నిత్య అనుష్టానం విధిగా చేయవలెను. వస్త్ర, అన్న దానములు అన్నిటా సహాయపడును. తల్లి, అత్త మొదలగు ఇంట్లోని పెద్దవారిని శ్రద్ధగా చూసుకొనుట బహు లాభదాయకం మరియు సుఖమునిచ్చును.

leo

Leo (సింహం)

మఘ 4, పుబ్బ 4, ఉత్తర 1 వ పాదములు

అష్టమ శని, మంచి, చేదు ఫలితములతో మిశ్రమముగా ఉండును. గురు సంచారం సంవత్సర మొదలులో అనుకూలం. శని ఇబ్బంది పెట్టిననూ క్రమ శిక్షణ నిలపెట్టును. రాహు కేతు డిసెంబర్ తదుపరి విశేషముగా లాభపెట్టును.

కొంత వివరంగా చూస్తే, రాహు కేతు సంచారం మిశ్రమంగా ఉండును. వ్యాపార నష్టం, మానసిక ఆందోళన, శత్రు భయం, అధిక ప్రయాణాలు, దంపతుల ఎడబాటు, రక్త సంబంధ వ్యాధులు, ఆకస్మిక ప్రయాణాలు. సువర్ణ మూర్తి కావున, కొంత ఉపశమనం.  డిసెంబర్ తదుపరి విశేషించును. పోటీ పరీక్షలు, న్యాయపర విషయాలలో, విజయం, ఆస్తి లాభం, ఆర్జన, కుటుంబ సంతోషాలు, ఆధ్యమిక ప్రదేశాల దర్శనం, ఖర్చు, కొంత అనారోగ్యం

గురు సంచారం జూన్ వరకు అత్యంత శుభం. కళ్యాణం, కార్య సిద్ధి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ నియామకాలు, గుర్తింపు, ఆస్తి సంపాదన, సమకూర్పు, కుటుంబ సంతోషాలు. సర్వ శుభ యోగం. తదుపరి, ఇబ్బందులు. భారీ ఖర్చు, పనిలో ఆటంకాలు, అగౌరవము, ఆస్తి నష్టం, మనస్పర్థలు, అహంకారం. గురు ప్రార్థన చాలా ముఖ్యం.

శని 8 సంచారం. అవమానం, ప్రమాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి నష్టం, సుఖవ్యాధులు, భార్యా/భర్త తీవ్ర అనారోగ్యం. అయితే జీవనంలో అత్యంత విలువైన లేక ముఖ్యమైన మైల్స్టోన్ జరుగును. శ్రమకు తగ్గ ఫలితములు కొంచెం అలస్యముగా వచ్చును. క్రమశిక్షణ అవసరము.

రైతులు మరియు వ్యాపారస్తులు: జూన్ వరకు, consulting, విద్య వ్యాపరాలలో ధనార్జన. తదుపరి డిసెంబర్ వరకు కొంచెం ఇబ్బంది. ట్రేడింగ్లో సామాన్య లాభాలు. డిసెంబర్ నుంచి విశేషముగా లాభించును. రాహు ప్రభావం, ఆకస్మిక ఫలితాలు. ఫ్యామిలీ బిజినెస్ లో లాభాలు.

ఉద్యోగస్థులు మరియు అధికారులు: ఉన్నత స్థానం, బదిలీలు, ప్రమోషన్లు జూన్ ముందు వచ్చే సూచన. డిసెంబర్ నుంచి బాగా కలసి వచ్చును. ఈ మధ్యలో ఓపిక పట్టవలెను. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. 

స్త్రీలు మరియు పిల్లలు: అంత కలసి వచ్చే కాలం కాదు. ధైర్యంగా క్రమశిక్షణగా పని చేయుట వలన, విశేషమైన లాభం మరియు ఫలితములు. అహంకారం వీడి పెద్దల నుంచి సలహాలు తీసుకుని ఎదరకు వెళ్ళవలెను.

గురువులు మరియు పెద్దలు: మనస్పర్థలు, అనవసర అహంభావాలు ఎక్కవగా ఉండును. న్యాయ విషయాలలో విజయం. ఆస్తి లాభం. మార్గదర్శకత్వం చాలా ముఖ్యం.

వీరు, తప్పని సరిగా, శివారాధన చేయాలి. మృత్యుంజయ జపం, స్త్రోత్ర పారాయణ బహు మేలు కల్కించును. సోమవారం చేయు శివ పూజ విశేషముగా లాభించును. పురాతన దేవాలయాలకు దాన ధర్మములు చేయుట మంచిది.

virgo

Virgo (కన్య)

ఉత్తర 3, హస్త 4, చిత్ర 2 పాదములు

సప్తమ శని మిశ్రమ ఫలితములు. ఇది అంతగా అనుకూల కాలం కాదు. అయితే కొన్ని శుభఫలితములు విశేషముగా ఉండును. గురు సంచారం సంవత్సర మధ్యలో అనుకూలం. శని ఇబ్బంది పెట్టిననూ క్రమ శిక్షణ నిలపెట్టును. రాహు కేతు నవెంబర్ చివరి వరకు విశేషముగా లాభపెట్టును.

కొంత వివరంగా చూస్తే, రాహు కేతు సంచారం మిశ్రమంగా ఉండును. నవంబర్ చివరకు వరకు బహు విశేషము. పోటీ పరీక్షలు, న్యాయపర విషయాలలో, విజయం, ఆస్తి లాభం, ఆర్జన, కుటుంబ సంతోషాలు, ఆధ్యమిక ప్రదేశాల దర్శనం, ఖర్చు, కొంత అనారోగ్యం. తదుపరి మానసిక ఆందోళన, పిల్లలకు అరిష్టం, స్టిరాస్తుల విషయంలో కొంత నష్టం, కొంత లాభం, ఆభరణాలు ఖరీదు, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి.

గురు సంచారం జూన్ నుంచి నవంబర్ మొదలు వరకు అత్యంత శుభం. కళ్యాణం, కార్య సిద్ధి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ నియామకాలు, గుర్తింపు, ఆస్తి సంపాదన, సమకూర్పు, కుటుంబ సంతోషాలు. సర్వ శుభ యోగం. తదుపరి, ఇబ్బందులు. భారీ ఖర్చు, పనిలో ఆటంకాలు, అగౌరవము, ఆస్తి నష్టం, మనస్పర్థలు, అహంకారం. గురు ప్రార్థన చాలా ముఖ్యం.

శని 7 సంచారం. అధిక ఖర్చు, అనారోగ్యం, వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, దంపతుల వియోగం. క్రమశిక్షణ, పారదర్శకత అవసరo. శ్రమకు తగ్గ ఫలితములు కొంచెం అలస్యముగా వచ్చును. క్రమశిక్షణ అవసరము.

రైతులు మరియు వ్యాపారస్తులు: అంతగా అనుకూల కాలం కాదు. అనుకోని ఆటంకాలు ఎక్కువగా ఉండును. అయినప్పటికీ, వ్యాపార వ్యవహారాలలో పారదర్శకత విశేషంగా లాభించును. జూన్ నుంచి నవంబర్ మొదలు వరకు మంచి సమయం. ప్రభుత్వ సహకారం లాభించును.  

ఉద్యోగస్థులు మరియు అధికారులు: ఉత్తమ కాలం. ప్రమోషన్, లాభాలు, ఎక్కువగా ఉండును. విశేష ప్రయాణాలు, దేవాలయ దర్శనం. బాగా కలసి వచ్చును. ఓపిక పట్టవలెను. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. 

స్త్రీలు మరియు పిల్లలు: కుటుంబంలో సఖ్యత అవసరం. వివాదాలకు దూరంగా ఉండవలెను. పిల్లలు చదువులపైన ప్రత్యేక శ్రద్ధ అవసరం. అహంకారం వీడి పెద్దల నుంచి సలహాలు తీసుకుని ఎదరకు వెళ్ళవలెను.

గురువులు మరియు పెద్దలు: స్థిరాస్థుల విషయంలో మొహం వీడవలెను. తదుపరి వంశీయులకు మార్గదర్శనం కావలెను. ఆరోగ్యం బాగుండును. కుటుంబ సంతోషాలకు కృషి చేయవలెను. విజయంతో ప్రభుత్వ ఆదాయం మరియు సుఖ సౌకర్యాలు కూడా లభించవచ్చు.

శ్రీ లక్ష్మీ నారాయణ పూజలు, విష్ణు సహస్ర నామ పారాయణ చేయుట అత్యంత శుభం మరియు లాభదాయకం. శ్రీ రమా సత్యనారాయణ పూజ లేక వ్రతం పౌర్ణమి నాడు చేయుట విశేషముగా కలసివచ్చును.

libra

Libra (తుల)

చిత్ర 2, స్వాతి 4, విశాఖ 3 పాదములు

ఈ రాశి వారికి అత్యంత సానుకూల అనుకూల సర్వ సిద్ధి సంవత్సరం. శనీశ్వరుడు 6 వ ఇంట బహు శుభం. గురు సంచారం కూడా మిక్కిలి లాభదాయకం. రాహు కేతు అంతగా కాలసిరాదు. మిశ్రమంగా ఉండును.

కొంత వివరంగా చూస్తే, రాహు కేతు సంచారం మానసిక ఆందోళన, పిల్లలకు అరిష్టం, స్టిరాస్తుల విషయంలో కొంత నష్టం, కొంత లాభం, ఆభరణాలు ఖరీదు, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి. తల్లికి కష్ట కాలం, అధిక ఖర్చు, వాహన ప్రమాదం, ఆస్తి నష్టం, కుటుంబ కలహాలు, ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు, పదవి పోవుట. దూర ప్రయాణం.

గురు సంచారం జూన్ నుంచి నవంబర్ మొదలు వరకు కొంత ఇబ్బంది పెట్టును. అధికారుల నుండి ఆపద/అవమానం, వృధా ప్రయాస ప్రయాణాలు, స్థాన మార్పు, నీరసం. మిగిలిన కాలంలో కళ్యాణం, కార్య సిద్ధి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ నియామకాలు, గుర్తింపు, ఆస్తి సంపాదన, సమకూర్పు, కుటుంబ సంతోషాలు. సర్వ శుభ యోగం.

శని 6 సంచారం. పోటీ పరీక్షలలో విజయం, కేసులలో విజయం, కళ్యాణం, ఆస్తి సంపాదన, ఉత్తమ కాలం, కుటుంబ సంతోషం.

రైతులు మరియు వ్యాపారస్తులు: అనుకూల కాలం. నల్లరేగడి పంటలు, పశు పాలన, సర్వీసెస్ వ్యాపారం బహు బాగుండును. ప్రభుత్వం నుంచి మంచి సహకారం లభించును. రియల్ ఎస్టేట్ వారికి కూడా అనుకూలం.

ఉద్యోగస్థులు మరియు అధికారులు: ఉత్తమ కాలం. ప్రమోషన్, లాభాలు, ఎక్కువగా ఉండును. విశేష ప్రయాణాలు, దేవాలయ దర్శనం. బాగా కలసి వచ్చును. ఓపిక పట్టవలెను. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. ప్రభుత్వ ఉద్యోగ అవకాశం. కొంత ఇబ్బంది జూన్ నుంచి నవంబర్ వరకు.

స్త్రీలు మరియు పిల్లలు: కుటుంబంలో సఖ్యత అవసరం. అనవసర మనస్పర్థలు రాకుండా చూసుకొనవలెను. అనvaసరమైన ఇగో తగ్గించుకోవలెను. కొత్త అభరణములు కొనుగోలు. పిల్లల చదువు శ్రద్ధగా ఉండవలెను. అంతా సులువుగా ఏమియు రాదు.

గురువులు మరియు పెద్దలు: సమాజములో గుర్తింపు, అనుకోని సంపద. విశిష్ఠమైన పనులు మరియు సమాజానికి మంచి చేయుదురు. కొంత అనారోగ్యం ఉన్ననూ మిక్కిలి మెండుగా ఉండును.  

సుబ్రహ్మణ్య స్వామి ఆరాధాన తప్పనిసరిగా చేయవలెను. క్రమశిక్షణ అవసరము, ఎక్కువగా కాలి నడక మంచిది. దగ్గరలో ఉండే శివాలయాలను దర్శించండి. పాలు పాల పదార్ధములు వితరణ విశేషముగా కలసివచ్చును.  

scorpio

Scorpio (వృశ్చికం)

విశాఖ 1 వ, అనూరాధ 4, జ్యేష్ఠ 4 పాదములు

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితములు. శని 5 వ ఇంట అంతా అనుకూలం కాదు. గురు సంచారం కూడా అంతగా యోగించదు. సంవత్సర మధ్య కాలములో ఉత్తమ ఫలితములు వచ్చును. రాహు కేతు సంచారం నవంబర్ తదుపరి యోగించును.

కొంత వివరంగా చూస్తే, రాహు కేతు సంచారం నవంబర్ వరకు కొంత ఇబ్బంది. తల్లికి కష్ట కాలం, అధిక ఖర్చు, వాహన ప్రమాదం, ఆస్తి నష్టం, కుటుంబ కలహాలు, ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు, పదవి పోవుట. దూర ప్రయాణం. తదుపరి వ్యాపార లాభం, కుటుంబ ఆనందం, సేవకుల భాగ్యం, వృత్తిలో ఉన్నతి, తండ్రికి అనారోగ్యం, రక్త సంబంధ ఇబ్బందులు. ఆధ్యాత్మిక గురువులతో తగాదాలు.

గురు సంచారం జూన్ నుంచి నవంబర్ మొదలు వరకు యోగించును. పుత్ర లాభం, సంతాన యోగం, వంశాభివృద్ధి, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, లాభదాయకం, పదోన్నతి, మతపెద్దలు, దేశ/రాజ్య పెద్దలతో మంతనాలు. స్థాన చలనం. మిగిలిన సమయం ఇబ్బందికరం. అధికారుల నుండి ఆపద/అవమానం, పదవులు పోవుట, ఉద్యోగం లో చిన్న చూపు, వృధా ప్రయాస ప్రయాణాలు, స్థాన మార్పు, నీరసం.   

శని 5 సంచారం. మానసిక ఆందోళనలు, కుటుంబం నుంచి దూరం, బంధువుల నుండి ప్రతికూలత, అధిక ఖర్చు, పిల్లలకు ఇబ్బందులు. కష్ట సమయం, ఆందోళన వదిలి, క్రమశిక్షణ అవసరం.

రైతులు మరియు వ్యాపారస్తులు: మిశ్రమ కాలం. కన్సల్టెన్సీ వారికి జూన్ నుంచి కలసివచ్చును. రైతులకు మంచి కాలం నవంబర్ వరకు. వృత్తి విద్యలు, వ్యాపారములు డిసెంబర్ నుంచి బాగుండును. మొత్తానికి మంచి కాలం.

ఉద్యోగస్థులు మరియు అధికారులు: ఈ సంవత్సరం అంతగా కలిసిరాదు. ప్రమోషన్ వచ్చినా, స్థాన మార్పిడి ఇబ్బంది పెట్టును. క్రమ శిక్షణ బహు అవసరం. కుటుంబం నుంచి దూరంగా ఉండవలసి రావచ్చును. కొంత సంసయనము అవసరము.  

స్త్రీలు మరియు పిల్లలు: నవంబర్ వరకు ఇబ్బంది. తదుపరి చాలా మంచి కాలం. పిల్లల, పెద్దల అనారోగ్యం ఉన్ననూ మీ యొక్క చొరవతో నెగ్గుకుని వస్తారు. పుత్ర లాభం అండ్ సంతాన యోగం.

గురువులు మరియు పెద్దలు: ఇబ్బంది కాలం. గుర్తింపు ఉండదు. మీరు అనుకోని రీతిలో అవమానం. ఆడగకుండా, ఎవరి విషములలో కలుగ చేసుకోవద్దు. మీ దైవ ధ్యానం చాలా అవసరం.   

వీరు పరమేశ్వర లేక ఇష్ట దేవతా ప్రార్థన విధిగా చేయవలెను. తగినంత దాన ధర్మాలు మంచిది. హనుమాన్ చాలీసా పఠనం విశేషముగా ఫలితములు ఇచ్చును.  

sagittairus

Sagittarius (ధనస్సు)

మూల 4, పూర్వాషాడ 4, ఉత్తరాషాడ 1 వ పాదములు

ఈ రాశి వారికి అర్థాష్ఠమి శని ఈ సంవత్సరమంతమూ ఉండును. ఇది అంతగా కలసి వచ్చేది కాదు. గురు సంచారం చాలా వరకు శుభము కావున, చాలా మటుకు సుఖముగా ఉండును. రాహు సంచారము కూడా సంవత్సరంలో చాలా మటుకు బాగున్నది.

కొంత వివరంగా చూస్తే, రాహు కేతు సంచారం నవంబర్ వరకు అద్భుతంగా ఉండును. వ్యాపార లాభం, కుటుంబ ఆనందం, సేవకుల భాగ్యం, వృత్తిలో ఉన్నతి. తదుపరి తండ్రికి అనారోగ్యం, రక్త సంబంధ ఇబ్బందులు. ఆధ్యాత్మిక గురువులతో తగాదాలు, ప్రమాదాలు, కుటుంబ సభ్యులకు అనారోగ్యం, మనస్పర్థలు., ఆకస్మిత ఖర్చులు, సుఖ వ్యాధులు, అగౌరవం.

గురు సంచారం జూన్ నుంచి నవంబర్ మొదలు వరకు యోగించదు. అనారోగ్యం, అధికముగా ఆహారం, మధు మ్యేహ వ్యాధి, నీరసం, అధిక ఖర్చు, మానసిక ఒత్తిడులు, అధికారులతో విభేదాలు, కేసులలో ఓటమి. వాహన గండం. తదుపరి పుత్ర లాభం, సంతాన యోగం, వంశాభివృద్ధి, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, లాభదాయకం, పదోన్నతి, మతపెద్దలు, దేశ/రాజ్య పెద్దలతో మంతనాలు. స్థాన చలనం.

శని 4 సంచారం. తల్లికి తీవ్ర అనారోగ్యం, ఖర్చులు, వాహన ప్రమాదాలు, కుటుంబ అసౌఖ్యం, దూర ప్రాంతములకు ప్రయాణం.

రైతులు మరియు వ్యాపారస్తులు: ఉత్తమ, మంచి కాలం. సంవత్సరం మొత్తం ఏదో రకముగా కలసి వచ్చును. సర్వీసెస్కు కలసి రాదు. లాభాలు మిక్కిలి మెండుగా ఉండును. పంటలకు చక్కటి ధరలు లభించును. 

ఉద్యోగస్థులు మరియు అధికారులు: జూన్ లోపు, మంచిగా ఉండును. ప్రమోషన్, బోనస్, మంచి ఇంక్రిమెంట్స్ ఉండును. ఉన్నతమైన సంపాదన. సంప్రదింపులు చాలా బాగా కలసివచ్చును. వాహన ప్రయణములో జాగురుతతో మెలగవలెను.   

స్త్రీలు మరియు పిల్లలు: కుటుంబంలో సానుకూలత ఉండదు. దూర ప్రాంత ప్రయాణములు ఇబ్బంది పెట్టును. పిల్లలకు మంచి చదువులు వచ్చును. ఆటలలో మెరుగుగా ఉండును.

గురువులు మరియు పెద్దలు: సేవకుల సౌకర్యం, మంచి సానుకూల పరిస్థితులు. వంశాభివృద్ధి మరియు ఉన్నత పదవులు. స్థాన చలనం. శుభకార్యములు అండ్ ఉన్నత ఆలోచనలు.    

వీరు అమ్మవారి పూజ తప్పనిసరిగా చేయవలెను. కుంకుమ పూజ, అమ్మవారి స్త్రోత్ర పఠనం మేలు. లలితా సహస్ర నామ పారాయణ విశేషముగా ఫలించును. అన్నదానం చేయుట మంచిది.

capricorn

Capricorn (మకరం)

ఉత్తరాషాడ 3, శ్రవణం 4, ధనిష్ఠ 2 పాదములు

ఈ రాశి వారికి శని శుభుడు. ఏలినాటి శని పూర్తి అయిన 2వ సంవత్సరం. శుభ ఫలితాలు ఉంటాయి. గురు సంచారం కూడా సంవత్సర మధ్యలో కలసివచ్చును. రాహు సంచారము సంవత్సరంలో అంతగా కలిసిరాదు.

కొంత వివరంగా చూస్తే, రాహు కేతు సంచారం సంవత్సరం మొత్తం ఇబ్బందిగా ఉండును. ప్రమాదాలు, కుటుంబ సభ్యులకు అనారోగ్యం, మనస్పర్థలు., ఆకస్మిత ఖర్చులు, సుఖ వ్యాధులు, అగౌరవం. అనారోగ్యం, గాయాలు, అవమానం, వ్యాపార చికాకులు, దంపతుల వియోగం

గురు సంచారం జూన్ నుంచి నవంబర్ మొదలు వరకు బాగుగా ఉండును. వాహన గృహ యోగం, స్థిరాస్తి కొనుగోలు, ఉత్తమ మైన కాలం. కళ్యాణ యోగం, గృహ సంతోషం, శుభకార్యాల సమయం. మెలిగిన కాలం అనారోగ్యం, అధికముగా ఆహారం, మధు మ్యేహ వ్యాధి, నీరసం, అధిక ఖర్చు, మానసిక ఒత్తిడులు, అధికారులతో విభేదాలు, కేసులలో ఓటమి. వాహన గండం.  

శని 3 సంచారం. వృత్తిలో పదోన్నతి, వ్యాపార బహు లాభం, స్థిర, చర్య ఆస్తులు కొనుగోలు, కుటుంబ సౌఖ్యం. న్యాయ పర విజయం, పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత. కళ్యాణ యోగం.

రైతులు మరియు వ్యాపారస్తులు: ఉత్తమ, మంచి కాలం. సంవత్సరం మొత్తం ఏదో రకముగా కలసి వచ్చును. పంటలకు చక్కటి ధరలు లభించును. నవంబర్ తదుపరి కొంత వ్యాపార చికాకులు. కుటుంబ వ్యాపారానికి కొంత గడ్డు కాలం.

ఉద్యోగస్థులు మరియు అధికారులు: వృత్తిలో పదోన్నతి, ఉత్తమ కాలం. స్థిర, చర ఆస్తులు కొనుగోలు. న్యాయపర విజయం. ఉత్తమ ఆహారం, అధికారుల సహాయ సహాయ సహకారములు. ఉన్నత స్థితి.    

స్త్రీలు మరియు పిల్లలు: కుటుంబంలో సఖ్యత ఉల్లాస వాతావరణములు. ఆకస్మిక ఖర్చులు. పిల్లలు ఆహారం పట్ల పలు జగర్తలు అవసరము. వాహన యోగం మరియు ఉల్లాసం.

గురువులు మరియు పెద్దలు: శుభకార్యములు అండ్ ఉన్నత ఆలోచనలు. మంచి ఆరోగ్యం, ఉన్నతమైన ఆలోచనలు. సమస్యల పరిష్కారం పరస్పరం మేలు. లీగల్ కేసులు కలిసి రావు.   

వీరు విధిగా సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయాలి. శరీర వ్యాయాయం తప్పనిసరి. గణపతి పూజ, గణపతి ఆలయ దర్శనం బహు మేలు చేయును. విష్ణు సహస్ర నామ పారాయణ విశేషముగా ఫలించును.

aquarius

Aquaries (కుంభం)

ధనిష్ఠ 2, శతభిషం 4, పూర్వాభాద్ర 3 పాదములు

ఏలినాటి శని చివర దశలో ఉన్నది. రాబోయే కాలం మంచి కాలం. గురు సంచారం చాలావరకు శుభ ప్రదం. రాహు కేతు, కొంత చికాకు పెడతారు. శని ప్రభావం తగ్గు ముఖం పడుతున్న శుభ సంకేతాలు వచ్చును.

కొంత వివరంగా చూస్తే, రాహు కేతు సంచారం సంవత్సరం మొత్తం ఇబ్బందిగా ఉండును. అనారోగ్యం, గాయాలు, అవమానం, వ్యాపార చికాకులు, దంపతుల వియోగం. నిర్బంధం, ప్రయాణాలు, కుటుంబ సాటి, దూర ప్రయాణాలు. కొంత మెరుగు శత్రువుల మీద జయం.

గురు సంచారం జూన్ నుంచి నవంబర్ మొదలు వరకు ఇబ్బందిగా ఉండును. అనారోగ్యం, మానసిక ఆందోళన, భారీ ఖర్చులు, ఆస్తి నష్టం. తగాదాలు. మిగిలిన సమయాలలో వాహన గృహ యోగం, స్థిరాస్తి కొనుగోలు, ఉత్తమ మైన కాలం. కళ్యాణ యోగం, గృహ సంతోషం, శుభకార్యాల సమయం. 

శని 2 సంచారం. కుటుంబ కలహాలు, దంపతుల వియోగం, ఖర్చులు, బంధువుల మరణ వార్తలు, ఆర్ధిక ఇబ్బందులు. సంవత్సర ద్వితీయములో, కొంత ఉపశమనము. ఏలినాటి శని చివర భాగం.

రైతులు మరియు వ్యాపారస్తులు: మిశ్రమ ఫలితములు. సంవత్సరం మొత్తం ఏదో రకముగా కలసి వచ్చును. పంటలకు చక్కటి ధరలు లభించును. కళ్యాణ యోగం మరియు శుభకార్యములు.

ఉద్యోగస్థులు మరియు అధికారులు: వృత్తిలో పదోన్నతి, ఉత్తమ కాలం. స్థిర, చర ఆస్తులు కొనుగోలు. అధికార లాభం. పండుగ వాతావరణం, శుభ కార్యములు. సామాజిక సౌఖ్యం.   

స్త్రీలు మరియు పిల్లలు: కుటుంబంలో చికాకులు, కలహాలు. ఆర్ధిక ఇబ్బందులు. క్రమ శిక్షణ మరియు ప్లానింగ్ తొ బయట పడగలరు. బంధువుల మరణ లేక అనారోగ్యం కలత చేయును.  

గురువులు మరియు పెద్దలు: అతి జాగురతతొ ఉండవలసిన కాలం. అనారోగ్యం నుండి కాపాడుకోవలెను. దూర ప్రయాణములు. దైవ బలమ చాలా అవసరము. వ్యాయాయం మిక్కిలి గుణం.    

వీరు ఉమా మహేశ్వర ఆరాధన చేయుట చాలా మంచిది. సోమవారం ఈశ్వర దర్శనం మేలు. శ్రీ రామ రక్షా స్త్రోత్రం విధిగా పఠన బహు విశేషముగా మేలు చేయును.

pisces

Pisces (మీనం)

పూర్వాభాద్ర 4 వ, ఉత్తరాభాద్ర 4, మీనం 4 పాదములు

ఈ రాశి వారికి ఏలినాటి శని మధ్యమ భాగంలో ఉన్నది. కష్ట కాలం. గురు సంచారం కూడా అంతా కలిసి వచ్చే సూచనలు లేవు. సంవత్సర మధ్య మరియు చివరాలలో గురు / రాహు సంచారం కొంత ఉపశమనం కల్గించవచ్చును.

కొంత వివరంగా చూస్తే, రాహు కేతు సంచారం సంవత్సరం నవంబర్ నుండి బాగా కలసివచ్చును. గృహ సౌఖ్యం, చింతా ముక్తి, స్టిరాస్తి కొనుగోలు, పెద్దల సహకారం. పిల్ల ఆరోగ్య సమస్య, కలహాలు, పెద్దలతో వివాదాలు. ఇంతకు ముందు కొంత ఇబ్బంది.

గురు సంచారం జూన్ నుంచి నవంబర్ మొదలు వరకు బహు కలిసి ఉండును. పుత్ర, పౌత్ర లాభం, స్టిరాస్తి సమకూలన, అధికార లాభం, పండుగ, శుభ కార్యక్రమములు, ఉత్తమ విద్య, సామాజిక శుభ కార్యక్రమములు, కుటుంబ సౌఖ్యం. అత్యుత్తమ సమయం. తదుపరి అనారోగ్యం, మానసిక ఆందోళన, భారీ ఖర్చులు, ఆస్తి నష్టం. తగాదాలు.   

శని 1 సంచారం. ఏలినాటి శని మధ్య భాగం, అనారోగ్య భారీ ఖర్చు, నిర్భందం, మరణ వార్తలు, ప్రమాదాలు, దూర ప్రయాణాలు, మానసిక ఆందోళన, దంపతుల వియోగం.

రైతులు మరియు వ్యాపారస్తులు: మిశ్రమ ఫలితములు. సంవత్సరం మొత్తం ఏదో రకముగా కలసి వచ్చినది కూడా పాడు అవును. పంటలకు చక్కటి ధరలు లభించును కానీ ఖర్చులు అధికముగా ఉండును. ఆస్తులు కూడగట్టుకొనుదురు. పుత్ర, పౌత్ర లాభం, స్టిరాస్తి సమకూలన, అధికార లాభం, పండుగ, శుభ కార్యక్రమములు, ఉత్తమ విద్య, సామాజిక శుభ కార్యక్రమములు, కుటుంబ సౌఖ్యం. అత్యుత్తమ సమయం

ఉద్యోగస్థులు మరియు అధికారులు: వృత్తిలో పదోన్నతి, ఉత్తమ కాలం. స్థిర, చర ఆస్తులు కొనుగోలు. అధికార లాభం. పండుగ వాతావరణం, శుభ కార్యములు. సామాజిక సౌఖ్యం. నవంబర్ తదుపరి కొంత ఇబ్బంది. అనారోగ్యం, మానసిక ఆందోళన, భారీ ఖర్చులు, ఆస్తి నష్టం. తగాదాలు.  

స్త్రీలు మరియు పిల్లలు: దూర ప్రయాణములు. విశేష శుభ కార్యములు మరియు అధిక ఖర్చు. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉండును. చదువులు కలిసి వచ్చును. గురువుల సహకారం లభించును. 

గురువులు మరియు పెద్దలు: చింతా ముక్తి. ఉత్తమ మైన మనస్సు. ఆందోళన లేనీ రోజులు. దైవ కార్యములు చేయగలరు. దంపతులకు మీ సలహా సహాయములు అవసరము. పుత్ర పౌత్ర లాభం. కుటుంబ సౌఖ్యం. అత్యుత్తమ సమయం.     

వీరు దక్షిణామూర్తి లేక ఇష్ట గురువును శ్రద్ధగా, విధిగా పూజించవలెను. గురువారం విధిగా సాయంత్రం హనుమాన్ చాలీసా చదువవలెను. చదువుకునే పిల్లలకు పుస్తకములు, పెన్నులు, మరియు ఇతర సామగ్రి ఇవ్వటం అంత్యంత మేలు చేయును.