Cancer (కర్కాటకం)
పునర్వసు 4వ, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదములు
పునర్వసు 4వ, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదములు
సాధారణ ఫలితములు. ఆకస్మిత లాభాలు, కొంత సమస్యలు. అన్ని రంగముల వారికి సౌఖ్యం ముఖ్యముగా doctors, నేవీ, సముద్ర యానం, నీటి మీద వ్యాపారస్తులకు అధిక లాభాలు. క్రొత్త ఉద్యోగాలు, క్రొత్త ఉపాధులు వస్తాయి. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలాలు. ఇక వివరాలలో వెళ్తే
గురుడు శత్రు/ధర్మ అధిపతి, (11) లాభ /12 (వ్యయ) / 1(తనూ) స్థానములలో తామ్ర / రజత / లోహ మూర్తిగా సంచారం వలన సాధారణ ఫలితాలు.
30/03/2025- 14/05/2025 తామర మూర్తిగా లాభ స్థానంలో సంచారం. కళ్యాణం, కార్య సిద్ధి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ నియామకాలు, గుర్తింపు, ఆస్తి సంపాదన, సమకూర్పు, కుటుంబ సంతోషాలు. సర్వ శుభ యోగం.
15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 లలో రజత /లోహ మూర్తిగా వ్యయ భావములో సంచారం, అనారోగ్యము, నిర్భందం, ఖర్చు, దంపతుల మధ్య మనస్పర్థలు, నష్టం, దూర ప్రయాణములు, అత్యంత ప్రమాద స్థితి. లోహ మూర్తి కావున, ఫలితాలు మరింత ఇబ్బందిగా ఉండును. శుభకార్యములకు ధన ఖర్చు.
19/10/2025 – 05/12/2025 లలో తామ్ర మూర్తిగా తానూ బావ సంచారం భారీ ఖర్చు, పనిలో ఆటంకాలు, అగౌరవము, ఆస్తి నష్టం, మనస్పర్థలు, అహంకారం. ఆరోగ్యం కుడుటపడుతుంది. గృహములో సంతోషాలు, శుభకార్యాలు.
శని సంవత్సరం అంతయు రజత మూర్తిగా ధర్మ స్థాన సంచారం. గత 2 ½ ఏండ్లుగా ఉన్న కష్టాలు తొలగును. వృత్తి లో, వ్యాపారము లో, వ్యవసాయము లో ఆటంకాలు ఎదురు అయినా, నిర్దిష్టమైన ప్రణాళికా, క్రమశిక్షణతో విజయం సాధించగలరు. గృహ సంబంధ ఇబ్బందులు, న్యాయపర ప్రతికూలత, క్రొత్తగా చేపట్టిన పనులు ఆలస్యమవును. క్రమశిక్షణ తో పరిస్థితులు అనుకూలం. ధర్మ బద్దమైన పనులకు అనుకూలం.
రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 సువర్ణ మూర్తిగా మీనం/కన్య లలో సంచారం, ఆపదలు, వృత్తిలో అసౌకర్యం, కొంత ఆనందము, అపరకర్మ యోగము. వ్యాపార లాభం, కోర్టు కేసులలో విజయం, అన్నదమ్ముల నుండి లాభం, సుఖం. తదుపరి లోహ మూర్తిగా కుంభ/ సింహ సంచారం.
అనారోగ్యం, అతి ప్రమాద సమయం, ఆకస్మిక ప్రమాదాలు, అనారోగ్యం, కఠిన మాట, అధిక ఖర్చు, కుటుంబ కలహాలు, ఆస్తి నష్టం.
మొత్తం మీద సాధారణ ఫలితములు. క్రమశిక్షణ, చాలా మంచి ఫలితములను ఇవ్వగలదు.