Capricorn (మకరం)
ఉత్తరాషాడ 3, శ్రవణం 4, ధనిష్ఠ 2 పాదములు
ఉత్తరాషాడ 3, శ్రవణం 4, ధనిష్ఠ 2 పాదములు
ఈ రాశి వార్కి అత్యుత్తమ ఫలితములు. అన్నిటా విజయములు. గౌరవ మర్యాదలు, పదవులు. ఏలినాటి శని ప్రభావం పోయి నూతన ఉత్సాహంతో పరుగులు తీస్తారు. ఆరోగ్యం మెరుగు పడును. ఇక వివరాలలోకి వెళ్తే’
గురుడు వ్యయ /భాతృ అధిపతి, (5) పుత్ర / 6 (శత్రు) / 7 (కళత్ర) స్థానములలో సువర్ణ/రజత మూర్తిగా సంచారం వలన అద్భుత ఫలితాలు. తలచినదే తడువు, పట్టిందే బంగారం. ఇక వివరాలు
గురుడు 30/03/2025- 14/05/2025 లలో సువర్ణ మూర్తి గా పుత్ర స్థాన సంచారం. పుత్ర, పౌత్ర లాభం, స్టిరాస్తి సమకూలన, అధికార లాభం, పండుగ, శుభ కార్యక్రమములు, ఉత్తమ విద్య, సామాజిక శుభ కార్యక్రమములు, కుటుంబ సౌఖ్యం. అత్యుత్తమ సమయం. తదుపరి 15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 లలో శత్రు స్థాన సంచారం. అనారోగ్యం, మానసిక ఆందోళన, భారీ ఖర్చులు, ఆస్తి నష్టం. తగాదాలు. సువర్ణ మూర్తి కవుట వలన, కొంత ఉపశమనం. తదుపరి 19/10/2025 – 05/12/2025 లలో కళత్ర స్థాన సంచారం వాహన గృహ యోగం, స్థిరాస్తి కొనుగోలు, ఉత్తమ మైన కాలం. కళ్యాణ యోగం, గృహ సంతోషం, శుభకార్యాల సమయం.
శని సంవత్సరం అంతయు భాతృ స్థాన సంచారం. ఏలినాటి శని పూర్తిగా తొలగిపోయినది. వృత్తిలో పదోన్నతి, వ్యాపార బహు లాభం, స్థిర, చర్య ఆస్తులు కొనుగోలు, కుటుంబ సౌఖ్యం. న్యాయ పర విజయం, పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత. కళ్యాణ యోగం.
రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 లలో మీనం/కన్య లలో 3 భాతృ/9ధర్మ సంచారం. వ్యాపార లాభం, కుటుంబ ఆనందం, సేవకుల భాగ్యం, వృత్తిలో ఉన్నతి, తండ్రికి అనారోగ్యం, రక్త సంబంధ ఇబ్బందులు. ఆధ్యాత్మిక గురువులతో తగాదాలు. తదుపరి 2ధన/8 ఆయు స్థాన సంచారం. ప్రమాదాలు, కుటుంబ సభ్యులకు అనారోగ్యం, మనస్పర్థలు., ఆకస్మిత ఖర్చులు, సుఖ వ్యాధులు, అగౌరవం.
మొత్తం మీద, ప్రశాంతమైన జీవనం, విజయం, నిర్భయం. అనుభవించు రాజా అన్నట్టు ఉంటుంది.