loading

Libra Yearly

  • Home
  • Blog
  • Libra Yearly

Libra Yearly

libra

Libra (తుల)

చిత్ర 2, స్వాతి 4, విశాఖ 3 పాదములు

ఈ రాశి వార్కి మంచి ఫలితములు. ధనం, సంపత్తు, ఆరోగ్యం, పుత్రాభివృద్ధి, దైవ బలం మెండుగా ఉండును. వ్యవసాయదారులకు, వ్యాపాస్తులకు మంచి కాలం. ఇక వివరాలలోకి వెళ్తే’

గురుడు భాతృ/శత్రు అధిపతి,  (8) ఆయు /9 (ధర్మ) / 10(కర్మ) స్థానములలో లోహ / రజత మూర్తిగా సంచారం వలన ఉత్తమ ఫలితాలు. అన్నిటా విజయం, లాభం. ఇక వివరాలలోకి వెళ్తే

గురుడు 30/03/2025- 14/05/2025 లలో లోహ మూర్తిగా ఆయు స్థాన సంచారం. అనారోగ్యం, అధికముగా ఆహారం, మధు మ్యేహ వ్యాధి, నీరసం, అధిక ఖర్చు, మానసిక ఒత్తిడులు, అధికారులతో విభేదాలు, కేసులలో ఓటమి. వాహన గండం.

15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 లలో రజత మూర్తిగా ధర్మ స్థాన సంచారం. పుత్ర లాభం, సంతాన యోగం, వంశాభివృద్ధి, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, లాభదాయకం, పదోన్నతి, మతపెద్దలు, దేశ/రాజ్య పెద్దలతో మంతనాలు. స్థాన చలనం.

19/10/2025 – 05/12/2025 లలో లోహ మూర్తిగా కర్మ స్థాన సంచారం. అధికారుల నుండి ఆపద/అవమానం, పదవులు పోవుట, ఉద్యోగం లో చిన్న చూపు, వృధా ప్రయాస ప్రయాణాలు, స్థాన మార్పు, నీరసం.

 

శని సంవత్సరం అంతయు సువర్ణ మూర్తిగా శత్రు స్థాన సంచారం. పోటీ పరీక్షలలో విజయం, కేసులలో విజయం, కళ్యాణం, ఆస్తి సంపాదన, ఉత్తమ కాలం, కుటుంబ సంతోషం. ఆరోగ్యం మెరుగుపడును. కోర్టు వ్యవహారాలలో విజయం.

 

రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 లలో లోహ మూర్తి గా 6శత్రు/12వ్యయ సంచారం. పోటీ పరీక్షలు, న్యాయపర విషయాలలో, విజయం, ఆస్తి లాభం, ఆర్జన, కుటుంబ సంతోషాలు, ఆధ్యమిక ప్రదేశాల దర్శనం, ఖర్చు, కొంత అనారోగ్యం. తదుపరి 5 పుత్ర/11 లాభ స్థాన సంచారం. మానసిక ఆందోళన, పిల్లలకు అరిష్టం, స్టిరాస్తుల విషయంలో కొంత నష్టం, కొంత లాభం, ఆభరణాలు ఖరీదు, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి.

 

మొత్తం మీద, పాత బాధలు తొలగి, ధైర్యంతో విజయం సాధిస్తారు.