loading

Aquarius Yearly

  • Home
  • Blog
  • Aquarius Yearly

Aquarius Yearly

aquarius

Aquaries (కుంభం)

ధనిష్ఠ 2, శతభిషం 4, పూర్వాభాద్ర 3 పాదములు

ఈ రాశి వార్కి కష్ఠకాలం. ఏలినాటి శని ప్రభావం ఆఖరి పాదం మరియు ప్రమాదకరం. కొంత ఓపిక, ప్రణాళిక, క్రమశిక్షణ, జాగురుత అవసరం. ఇక వివరాలలోకి వెళ్తే’

 

గురుడు లాభ/ధన అధిపతి,  (4) మాతృ / (5) పుత్ర / 6  (శత్రు) / స్థానములలో లోహ తామ్ర రజత మూర్తిగా సంచారం లాభ దాయకం. ఇక వివరాలలోకి వెళ్తే


గురుడు 30/03/2025- 14/05/2025 లలో లోహ మూర్తిగా మాతృ స్థాన సంచారం. ప్రభుత్వ దండన, పదవి పోవుట, అపనిందలు, దగ్గర సంబంధీకుల మరణం, మనో వ్యథ, వస్తు నాశనం. తదుపరి 15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 లలో తామ్ర / రజత మూర్తిగా పుత్ర స్థాన సంచారం. పుత్ర, పౌత్ర లాభం, స్టిరాస్తి సమకూలన, అధికార లాభం, పండుగ, శుభ కార్యక్రమములు, ఉత్తమ విద్య, సామాజిక శుభ కార్యక్రమములు, కుటుంబ సౌఖ్యం. అత్యుత్తమ సమయం. ఇక 19/10/2025 – 05/12/2025 లలో లోహ మూర్తిగా శత్రు స్థాన సంచారం. అనారోగ్యం, మానసిక ఆందోళన, భారీ ఖర్చులు, ఆస్తి నష్టం. తగాదాలు.


శని సంవత్సరం అంతయు రజత మూర్తిగా ధన స్థాన సంచారం. ఏలినాటి శని ఆఖరి ఘట్టం. కుటుంబ కలహాలు, దంపతుల వియోగం, ఖర్చులు, బంధువుల మరణ వార్తలు, ఆర్ధిక ఇబ్బందులు. సంవత్సర ద్వితీయములో, కొంత ఉపశమనము. ఏలినాటి శని చివర భాగం.


రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 లలో మీనం/కన్య లలో 2ధన/8 ఆయు సంచారం. ప్రమాదాలు, కుటుంబ సభ్యులకు అనారోగ్యం, మనస్పర్థలు., ఆకస్మిత ఖర్చులు, సుఖ వ్యాధులు, అగౌరవం. తదుపరి కుంభ/ సింహ లలో రజత మూర్తిగా 1 తను/7 సింహ స్థాన సంచారం. అనారోగ్యం, గాయాలు, అవమానం, వ్యాపార చికాకులు, దంపతుల వియోగం.


మొత్తం మీద గురు సంచారం కలసి వచ్చేది. శని. రాహు/కేతు ఇబ్బందులు పెట్టిన, గురు బలంచేత, ఉపశమనం పొందుదురు.