loading

Zodiac Sign: Virgo

Virgo Yearly

Virgo (కన్య)

ఉత్తర 3, హస్త 4, చిత్ర 2 పాదములు

ఈ రాశివార్కి మిశ్రమ ఫలితాలు. ఊహించని లాభాలు. రాజకీయ, వర్తక, బ్యాంకింగ్, షేర్ మార్కెట్ వారికి ఉత్తమ లాభాలు. వ్యవసాయదారులకు మిశ్రమ లాభాలు. ఇక వివరాలలోకి వెళ్తే’

 

గురుడు మాతృ/కళత్ర అధిపతి,  (9) ధర్మ /10 (కర్మ) / 11(లాభ) స్థానములలో రజత/తామ్ర/సువర్ణ మూర్తిగా సంచారం వలన ఉత్తమ ఫలితాలు. అన్నిటా విజయం, సౌఖ్యం. ఇక వివరాలలోకి వెళ్తే

గురుడు 30/03/2025- 14/05/2025 రజత మూర్తిగా ధర్మ స్థాన సంచారం. పుత్ర లాభం, సంతాన యోగం, వంశాభివృద్ధి, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, లాభదాయకం, పదోన్నతి, మత పెద్దలు, దేశ/రాజ్య పెద్దలతో మంతనాలు. స్థాన చలనం.

15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 తామ్ర మూర్తిగా కర్మ స్థాన సంచారం. అధికారుల నుండి ఆపద/అవమానం, పదవులు పోవుట, ఉద్యోగం లో చిన్న చూపు, వృధా ప్రయాస ప్రయాణాలు, స్థాన మార్పు, నీరసం.

19/10/2025 – 05/12/2025 సువర్ణ మూర్తిగా లాభ స్థాన సంచారం. కళ్యాణం, కార్య సిద్ధి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ నియామకాలు, గుర్తింపు, ఆస్తి సంపాదన, సమ కూర్పు, కుటుంబ సంతోషాలు. సర్వ శుభ యోగం.

 

శని సంవత్సరం అంతయు తామ్ర మూర్తిగా కళత్ర స్థాన సంచారం. అధిక ఖర్చు, అనారోగ్యం, వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, దంపతుల వియోగం. క్రమశిక్షణ, పారదర్శకత అవసరం. దంపతులు ఇరువురు చర్చించి తీసుకున్న నిర్ణయాలు విశేషంగా ఫలించును. ఇది వ్యాపారములో భాగస్వాములకు కూడా వర్తించును.

 

రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 రజత మూర్తిగా 7 కళత్ర /1తనూ భావ సంచారం. వ్యాపార నష్టం, మానసిక ఆందోళన, శత్రు భయం, అధిక ప్రయాణాలు, దంపతుల ఎడబాటు, రక్త సంబంధ వ్యాధులు, ఆకస్మిక ప్రయాణాలు. సువర్ణ మూతి కావున, కొంత ఉపశమనం. తదుపరి తామ్ర మూర్తిగా 6శత్రు/12వ్యయ  భావ సంచారం. పోటీ పరీక్షలు, న్యాయపర విషయాలలో, విజయం, ఆస్తి లాభం, ఆర్జన, కుటుంబ సంతోషాలు, ఆధ్యమిక ప్రదేశాల దర్శనం, ఖర్చు, కొంత అనారోగ్యం.

 

మొత్తం మీద పాత బాధలు పోయి ఉల్లాసంగా లాభసాటిగా ఉండును.

Virgo Daily

Enmity with father or elders. Illness to father. Unexpected expenditure and unnecessary travel. Loss in assets, status and honour. Stubborn and egoistic nature will lead to arguments.