loading

Taurus Yearly

  • Home
  • Blog
  • Taurus Yearly

Taurus Yearly

taurus

Taurus (వృషభం)

కృత్తిక 3, రోహిణి 4, మృగశిర 2 పాదములు

యోగించే కాలం. పట్టిందల్లా బంగారం. ధనం, సంపత్తు, సౌఖ్యం. స్థిరాస్తి కొనుగోలు, నూతన ఉద్యోగ/వ్యాపార ప్రారంభం. అనేక విధముల మంచి కాలం. వ్యవసాయదారులకు మంచి ధరలు లభించును. గురువులకు, ప్రభువులకు మంచి కాలం. ఇక వివరాలలోకి వెళ్తే గురుడు ఆయు, లాభ అధిపతి (1)తను / 2 (ధన) / 3(భాతృ) స్థానములలో రజత / తామ్ర మూర్తిగా సంచారం వలన కలసి వచ్చే పరిస్థితి. కొంత ప్రతికూలం ఉన్ననూ మొత్తం మీద బావుండును.

 

30/03/2025- 14/05/2025 వరకు తనూ స్థానం, భారీ ఖర్చు, పనిలో ఆటంకాలు, అగౌరవము, ఆస్తి నష్టం, మనస్పర్థలు, అహంకారం.

 

15/05/2025 – 18/10/2025 మరియు 06/12/2026 – 19/03/2026 లలో రజత మూర్తి గా ధన స్థాన సంచారం. కళ్యాణ యోగం. పండుగ వాతావారణం, ఉద్యోగం, పదోన్నతి, అన్నిటా విజయం, వస్తు కనక వాహన ప్రాప్తి. కీర్తి, గౌరవం. సంతాన ప్రాప్తి. తామ్ర మూర్తి కావున ఉత్తమ ఫలితాలు.

19/10/2025 – 05/12/2025 లలో రజత మూర్తిగా భాతృ స్థాన సంచారం. కొంత అనారోగ్యము, అధిక ఖర్చు, శ్రమతో కూడిన వృధా ప్రయాణములు. బదిలీలు, స్థల మార్పిడి ఉన్ననూ కాలం కలసివచ్చును.

 

శని సంవత్సరమంతయు సువర్ణ మూర్తిగా లాభ స్థాన సంచారం. కళ్యాణం, పుత్ర, పౌత్ర, కనక, వస్తు లాభం, ప్రభుత్వము నుండి లాభం. వ్యాపారము లాభసాటి. సమాజ గౌరవము. అత్యంత లాభసాటి. అనుకున్న పనులు అన్నియూ పూర్తి అవును.

 

రాహు / కేతు 30/03/2025 – 29/05/2025 మీనం/కన్య సంచారం వలన గృహ సౌఖ్యం, చింతా ముక్తి, స్టిరాస్తి కొనుగోలు, పెద్దల సహకారం. పిల్లల ఆరోగ్య సమస్య, కలహాలు, పెద్దలతో వివాదాలు. తదుపరి సంవత్సరం అంతయు కుంభ/ సింహ సంచారం వలన వృత్తిలో విజయం, అనుకూలం, స్థల మార్పిడి, కొంత అనారోగ్యం, తల్లికి అగౌరవము, అనారోగ్యము.

 

మొత్తం మీద, ఈ సంవత్సరం, గ్రహములు అనుకూలించుట చేత, జీవన సౌఖ్యం, మీ మాటకు ఎదురు లేకపోవుట, అభివృద్ధి, అందరిలోనూ మీ ఆధిక్యత ప్రత్యేకత కనబడును. సువర్ణ కాలం, అనుకున్న పనులు సాధించండి.