loading

Aries Yearly

  • Home
  • Blog
  • Aries Yearly

Aries Yearly

aries

Aries (మేషం)

ఆశ్విని 4 , భరణి4 , కృత్తిక 1 వ పాదం

ఈ రాశి వారికి అన్ని విధములా అనుకూలంగా ఉండును. ఏలినాటి ప్రారంభం. క్రమశిక్షణ, చేసిన వాటికి ఫలితములు అనుభవించు కాలం. శని, రాహు, కేతు, గురు సంచారం విశిష్ఠమైన ఫలితాలు ఇవ్వగలవు. నూతన కొలువు లేక నూతన వ్యాపార ప్రారంభ కాలం. వ్యవసాయదారులకు మంచి సమయం. నూతన పంటలు లేక క్రొత్త వంగడాలు, ప్రయోగాలు ఫలించును. గురువులకు కొంత పరీక్షా కాలం. ఇక వివరాలలోకి వెళ్తే

గురుడు భాగ్య, వ్యయ అధిపతి (2)ధన / 3(భాతృ) / 4(మాతృ) స్థానములలో తామ్ర / సువర్ణ / లోహ మూర్తిగా సంచారం వలన కలసి వచ్చే పరిస్థితి. కొంత ప్రతికూలం ఉన్ననూ మొత్తం మీద బావుండును.   


30/03/2025- 14/05/2025 వరకు ధన స్థానంలో కళ్యాణ యోగం. పండుగ వాతావారణం, ఉద్యోగం, పదోన్నతి, అన్నిటా విజయం, వస్తు కనక వాహన ప్రాప్తి. కీర్తి, గౌరవం. సంతాన ప్రాప్తి. తామ్ర మూర్తి కావున ఉత్తమ ఫలితాలు.


15/05/2025–18/10/2025 (లోహ) మరియు 06/12/2026–19/03/2026 (తామ్ర) భాతృ స్థానంలో అనారోగ్యము, అధిక ఖర్చు, శ్రమతో కూడిన వృధా ప్రయాణములు. బదిలీలు, స్థల మార్పిడి. విశేష వ్యథ. తామ్ర మూర్తి, కొంత ఉపశమనం కలుగ చేయును. ఇది మిథున రాశి కావటం చేతను, సోమరితనం పెరిగి, పనులు వాయిదా వేయు స్వభావం కల్గును. ఇది ప్రమాదకరం మరియు అధికారుల ఆగ్రహ ప్రాప్తం. ఇది, ధార్మిక విషయములు, కుటుంబ, సామాజిక విషయములలో కాలసివచ్చును. పరస్పర సహకారం, బంధు, మిత్ర, సోదర, సోదరీ సహకారంతో ఉల్లాస ఉత్సాహ కాలం. దంపతులకు అన్యోన్యకాలం.


19/10/2025 – 05/12/2025 (సువర్ణ) మాతృ స్థానంలో ప్రభుత్వ దండన, పదవి పోవుట, అపనిందలు, దగ్గర సంబంధీకుల మరణం, మనో వ్యథ, వస్తు నాశనం. సువర్ణ మూర్తి / ఉచ్చ స్థానం, కావున కొంత ఉపశమనం కలుగవచ్చు.


శని సంవత్సరం అంతటా లోహ మూర్తి వ్యయ స్థానంలో సంచారం. ఏలినాటి శని ప్రారంభం. మొదటి పర్యాయమైనచో, తల్లిదండ్రులకు, రెండవది జాతకునకు, మూడవది పిల్లలకు లేక మరణ ప్రాయ ఫలితములు కల్గును. అనారోగ్యం, భారీ ఖర్చు, భార్యా పిల్లలు, తల్లి దండ్రులతో వివాదాలు, నిర్బంధం, అవమానాలు. పరివారము నుండి దూరముగా ఉండుట మొదలగు మానసిక సమస్యలు ఉండవచ్చును. విదేశీ నివాస అవకాశం, విదేశీ మార్గాల ద్వారా సంపాదన. ప్రతీ రోజు సాయంత్ర కాలం విధిగా హనుమాన్ చాలీసా చదువుట చాలా మంచిది.


రాహు / కేతు సంచారం 30/03/2025 – 29/05/2025 మీనం/కన్య సంచారం వలన శత్రు నాశనం, ఆరోగ్యం, భారీ ఖర్చు, విదేశీ / దూర ప్రయాణం.

తదుపరి 30/05/2025 – 19/03/2026 కుంభ/ సింహ సంచారం వలన, గృహ సౌఖ్యం, చింతా ముక్తి, స్టిరాస్తి కొనుగోలు, పెద్దల సహకారం. పిల్ల ఆరోగ్య సమస్య, కలహాలు ఉన్ననూ కుటుంబంలో సంతోషాలు. శత్రువులు కూడా మిత్రులై సహకరించగలరు. ఆగిపోయిన పనులు పూర్తి అవును.

మొత్తం మీద గడచిన సంవత్సరం కన్నా మెరుగుగా ఉండును. మీ శక్తి సామర్థ్యాలు, స్కిల్స్ పెంచుకొనుట వలన లాభం చేకొరును.