loading

Category: Telugu Padhyaalu

  • Home
  • Category: Telugu Padhyaalu

శరణు శరణు సంజీవరాయ

అంజని తనయుడా అభివాదము ఆంజనేయ
వాయు నందనుడా వందనము వానరవీర
రుద్రావతారా కైవారము హరదశ హరివీర
శరణ్యము సంజీవరాయ శరణాగతి సామీరి

ధర్మ పరిరక్షకా ప్రశంసనము సుగ్రీవమిత్ర
రాక్షస సంహారా నమసము వజ్రకంఠ
రామ ప్రియదూత కీర్తనము కరువలిపట్టు
శరణ్యము సంజీవరాయ శరణాగతి సామీరి

సీతారామ భక్తా హస్తార్పణము హనుమంత
ఆనందారోగ్య దాయి అభినందనము అనుమయ్య
శక్తి ముక్తి ప్రదాతా ప్రణామము ప్రాభంజని
శరణ్యము సంజీవరాయ శరణాగతి సామీరి

                                  రామకృష్ణ తేజోమూర్తుల

నీ నీడ నీతోనే

సుఖదుఃఖాలలో నీతోడు ఎవరు నీవారు ఎవరు
నమ్మకమే ధైర్యము అనుమానమే అవమానం

వెలుగులో ఉన్న నీడ ఎక్కడుంది చీకట్లో
సుఖములో సొంతం సంకటంలో మాయమా
ఎల్లవేళలా నీతోడుండే నీడ నీకు ద్రోహం చేసినదా
నీడ కూడ సుఖసమయ అవకాశవాదియేనా

సుఖదుఃఖాలలో నీ తోడు ఎవరు నీవారు ఎవరు

నిను వీడని నీడను సైతం నమ్మలేక పోతున్నావా
వెంటనున్న నీడను చీకట్లో చూడలేకపోయావేమో
వెలుగులో ఉన్న ధైర్యం చీకట్లో భయమైనదేమో
నీడను నమ్మి కాంతి లోకి నడు నీ నీడ నీతోనే

నమ్మకమే ధైర్యము అనుమానమే అవమానం

                                      రామకృష్ణ తేజోమూర్తుల